WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 11 July 2014

MANSOON HAIR CARE TIPS IN TELUGU - BEAUTY TIPS FOR CARING HAIR IN RAINY SEASON IN TELUGU



వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు 

1) మీ జుట్టును పొడిగా ఉంచండి: సాధ్యమైనంత ఎక్కువ సమయం మీ జుట్టు పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మనం సుమారు 50-60 వెంట్రుకలను కోల్పోతాము, కానీ వర్షాకాల సమయంలో మనకు తెలియకుండా 200 వెంట్రుకలను కోల్పోతాము. ఇది అదనంగా జుట్టు రాలడ౦, చుండ్రు వంటి జుట్టు సమస్యలను నివారించి మీ జుట్టు ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోండి 

2) తేలికపాటి షాంపూ లను ఉపయోగించండి: మీరు చుండ్రు, జుట్టురాలడమే కాకుండా తల జిడ్డుదనాన్ని కూడా కలిగిఉ౦డవచ్చు. అందువల్ల మీరు మీ జుట్టును ప్రతిరోజూ తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి. ఆయిలీ జుట్టు కలవారు ప్రతిరోజూ షాంపూ పెట్టడానికి వేరొక కారణం కూడా ఉంది, మీ జుట్టు వర్షాకాలంలో దెబ్బతినవచ్చు, షాంపూ చేయడం వల్ల మాత్రమే మీ జుట్టు పరిమాణాన్ని పునరుద్దరించు కుంటుంది. ప్రతిరోజూ మీ జుట్టు వర్షానికి తడిస్తే ప్రతిరోజూ షాంపూ పెట్టండి.

3) ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహార పదార్ధం. అయితే, మీ జుట్టు అందంగా కనిపించాలి అనుకుంటే, చేపలు, గుడ్లు, కారెట్లు, తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ కూరగయలు, చిక్కుళ్ళు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాలుత్పత్తుల వంటి ఎక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి.

4) కనీసం వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయడం : వారంలో ఒక సారి తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

5) పెద్ద పళ్ళ దువ్వేనను ఉపయోగించడం: పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కలగ కుండా ఉంటుంది. చిక్కు సులభంగా వస్తుంది.

6) జుట్టు తడిగా ఉన్నపుడు బిగి౦చకుండా ఉండడం: జుట్టు తేమగా ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వల్ల కేశాలు పెళుసుగా తయారవుతాయి. జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది కనుక పూర్తిగా ఆరనివ్వండి.

ARTICLE ON TELUGU CULTURE AND TRADITIONAL PADAHARANALA TELUGU AMMAI - TELUGU TRADITIONAL BEAUTY



పదహారణాల తెలుగమ్మాయి అంటే..!?  

అది తెలుసుకోవాలంటే ముందు పదహారణాలు అంటే ఏంటో పరిశీలిద్దాం.

భారత దేశంలో ఒకప్పుడు అణాలు ఉండేవి అని మన అందరికి తెలుసు. ఆ తరువాతి కాలంలో రూపాయి ప్రవేశపెట్టబడింది. రూపాయి అంటే వంద పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చలంటే ఒక భాజకం ఉండాలి కదా, అది ఒక అణా = 6.25 పైసలు.


మనలో చాలా మందికి తెలిసిన కొన్ని పదాలు పరిశీలిస్తే. (భావితరాలకు తెలిసే అవకాశంలేదు, ఎందుకంటే అవి వాడుకలోంచి వెళ్ళిపోయాయి)

చారాణా (చార్, అణా) = 4 * 6.25 =25 పైసలు

ఆటాణా (ఆట్, అణా) = 8 * 6.25 = 50 పైసలు

బారాణా (బారహ్, అణా) = 12 * 6.25 = 75 పైసలు


లెక్క సరిపోయింది కదా. ఇక పదహారణాలు అంటే 16 * 6.25 = 100 పైసలు. 

అంటే నిండు రూపాయి. లేదా నూటికి నూరు శాతం (100%). 99.9999..% కూడా 100% కి సమానం కాదు. 

ఇక పదహారణాల తెలుగమ్మాయంటే నూటికి నూరుశాతం తెలుగమ్మాయి, నిండైన తెలుగమ్మాయి, సంపూర్ణమైన తెలుగమ్మాయి అని చెప్పుకోవచ్చు. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలొ, ఇలా ప్రతివిషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయి మాతమే పదహారణాల తెలుగమ్మాయి అనడానికి అర్హత కలిగిన అమ్మాయి. ఏ ఒక్క విషయంలో తెలుగుదనం లేకున్నా తనకు పదహారణాలు తెలుగమ్మయి అని పిలవబడటానికి అర్హత లేదు.

TELUGU LANGUAGE AND ITS ALPHABETS - DETAILED LIST OF TELUGU GUNINTHALU


గుణింతాలు :


గుణింతం అంటే తెలుగు హల్లుకి అచ్చు కూడటంవలన వచ్చే శబ్దాల అమరిక. 
ఈ క్రింది పట్టికలో తెలుగు అక్షరాలు వాటి గుణింతాలు ఇవ్వబడ్డాయి.



అక్షరం గుణింతం 


క :
---
క, కా, కి, కీ, కు, కూ, కృ, కౄ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః
ఖ :
----
ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ, ఖృ, ఖౄ, ఖె, ఖే, ఖై, ఖొ, ఖో, ఖౌ, ఖం, ఖః
గ ;
---
గ, గా, గి, గీ, గు, గూ, గృ, గౄ, గె, గే, గై, గొ, గో, గౌ, గం, గః
ఘ:
----
ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘృ, ఘౄ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః
చ :
----
చ, చా, చి, చీ, చు, చూ, చృ, చౄ, చె, చే, చై, చొ, చో, చౌ, చం, చః
ఛ :
----
ఛ, ఛా, ఛి, ఛీ, ఛు, ఛూ, ఛృ, ఛౄ, ఛె, ఛే, ఛై, ఛొ, ఛో, ఛౌ, ఛం, ఛః
జ :
---
జ, జా, జి, జీ, జు, జూ, జృ, జౄ, జె, జే, జై, జొ, జో, జౌ, జం, జః
ఝ :
------
ఝ, ఝా, ఝి, ఝీ, ఝు, ఝూ, ఝృ, ఝౄ, ఝె, ఝే, ఝై, ఝొ, ఝో, ఝౌ, ఝం, ఝః
ట :
----
ట, టా, టి, టీ, టు, టూ, టృ, టౄ, టె, టే, టై, టొ, టో, టౌ, టం, టః
ఠ :
---
ఠ, ఠా, ఠి, ఠీ, ఠు, ఠూ, ఠృ, ఠౄ, ఠె, ఠే, ఠై, ఠొ, ఠో, ఠౌ, ఠం, ఠః
డ :
----
డ, డా, డి, డీ, డు, డూ, డృ, డౄ, డె, డే, డై, డొ, డో, డౌ, డం, డః
ఢ :
----
ఢ, ఢా, ఢి, ఢీ, ఢు, ఢూ, ఢృ, ఢౄ, ఢె, ఢే, ఢై, ఢొ, ఢో, ఢౌ, ఢం, ఢః
ణ :
----
ణ, ణా, ణి, ణీ, ణు, ణూ, ణృ, ణౄ, ణె, ణే, ణై, ణొ, ణో, ణౌ, ణం, ణః
త :
----
త, తా, తి, తీ, తు, తూ, తృ, తౄ, తె, తే, తై, తొ తో, తౌ, తం, తః
థ :
----
థ, థా, థి, థీ, థు, థూ, థృ, థౄ, థె, థే, థై, థొ, థో, ధౌ, థం, థః
ద :
----
ద, దా, ది, దీ, దు, దూ, దృ, దౄ, దె, దే, దై, దొ, దో, దౌ, దం, దః
ధ :
----
ధ, ధా, ధి, ధీ, ధు, ధూ, ధృ, ధౄ, ధె, ధే, ధై, ధొ, ధో, ధౌ, ధం, ధః
న :
----
న, నా, ని, నీ, ను, నూ, నృ, నౄ, నె, నే, నై, నొ, నో, నౌ, నం, నః
ప :
----
ప, పా, పి, పీ, పు, పూ, పృ, పౄ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః
ఫ :
----
ఫ, ఫా, ఫి, ఫీ, ఫు, ఫూ, ఫృ, ఫౄ, ఫె, ఫే, ఫై, ఫొ, ఫో, ఫౌ, ఫం, ఫః
బ :
---
బ, బా, బి, బీ, బు, బూ, బృ, బౄ, బె, బే, బై, బొ, బో, బౌ, బం, బః
భ :
----
భ, భా, భి, భీ, భు, భూ, భృ, భౄ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః
మ :
-----
మ, మా, మి, మీ, ము, మూ, మృ, మౄ, మె, మే, మై, మొ, మో, మౌ, మం, మః
య :
------
య, యా, యి, యీ, యు, యూ, యృ, యౄ, యొ, యే, యై, యొ, యో, యౌ, యం, యః
ర :
---
ర, రా, రి, రీ, రు, రూ, రృ, రౄ, రె, రే, రై, రొ, రో, రౌ, రం, రః
ల :
---
ల, లా, లి, లీ, లు, లూ, లృ, లౄ, లె, లే, లై, లొ, లో, లౌ, లం, లః
వ :
---
వ, వా, వి, వీ, వు, వూ, వృ, వౄ, వె, వే, వై, వొ, వో, వౌ, వం, వః
శ :
---
శ, శా, శి, శీ, శు, శూ, శృ, శౄ, శె, శే, శై, శొ, శో, శౌ, శం, శః
ష :
---
ష, షా, షి, షీ, షు, షూ, షృ, షౄ, షె, షే, షై, షొ, షో, షౌ, షం, షః
స :
---
స, సా, సి, సీ, సు, సూ, సృ, సౄ, సె, సే, సై, సొ, సో, సౌ, సం, సః
హ :
---
హ, హా, హి, హీ, హు, హూ, హృ, హౄ, హె, హే, హై, హొ, హో, హౌ, హం, హః
క్ష :
---
క్ష, క్షా, క్షి, క్షీ, క్షు, క్షూ, క్ష్, క్ష్, క్షె, క్షే, క్షై, క్షొ, క్షో, క్షౌ, క్షం, క్షః