WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 9 September 2016

ANNAMACHARYA KEERTHANA - MUDDHU GARE YASODHA


అన్నమాచర్య కీర్తన.!
.
(ముద్దుగారే యసోద ముంగిట ముత్యమువీడు)
పల్లవి 
ముద్దుగారే యసోద ముంగిట ముత్యమువీడు 

దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
చరణం 1 :
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాదే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు....
చరణం 2 :
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేదధీకము
సతమై సంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు
చరణం 3 :
కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము
ఏల్లేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము
పాలజల నిధీలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె దరిగి పద్మనాభుడు
https://www.youtube.com/watch?v=602Xn-8Q070

No comments:

Post a Comment