వాషింగ్ మెషీన్‌లో దుస్తులు ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోండి..!
ఒకప్పుడంటే సబ్బు పెట్టి రుద్ది రుద్ది బట్టలు ఉతుక్కునే వారు కానీ ఇప్పుడు దాదాపు ఎక్కడా చూసినా ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్‌నే వాడుతున్నారు. దుస్తులన్నింటినీ మెషీన్‌లో వేయడం, డిటర్జెంట్ కలపడం, ఉతకడం, డ్రై చేయడం ఇలా అన్నీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా అయిపోతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వాషింగ్ మెషీన్ ద్వారా సులభంగా బట్టలను ఉతుకుతున్నారు కానీ, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. దీని వల్ల దుస్తులు త్వరగా పాడైపోవడమో, పోగులు బయటికి వచ్చి రంగు పోవడమో జరుగుతోంది. అయితే కింద ఇచ్చిన పలు జాగ్రత్తలను పాటిస్తే దుస్తులను ఎంతో కాలం మన్నికగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రెడీమేడ్‌గా కొన్న దుస్తులైనా, కుట్టించుకున్న వైనా వాటి మీద లేబుల్స్ కచ్చితంగా ఉంటాయి. ఆ లేబుల్స్‌పై సదరు దుస్తులను ఎలా ఉతకాలో రాసి ఉంటుంది. ఆ ప్రకారం దుస్తుల్ని ఉతికితే చాలు. అవి ఎంతో కాలం మన్నికగా ఉంటాయి. రంగు కూడా పోవు.
2. సాధారణంగా ప్యాంట్లను ఉతికేటప్పుడు వాటిని వాషింగ్ మెషీన్‌లో అలాగే వేస్తారు. దీని వల్ల ఆ ప్యాంట్లకు ఉండే జిప్పులు ఇతర దుస్తులకు ఇరుక్కుని అవి కూడా పాడైపోతాయి. దీన్ని నివారించాలంటే ప్యాంట్ జిప్‌ను పూర్తిగా పైకి లాగి జిప్‌ను పై వైపుకు వచ్చేలా ఉంచాలి. దీని వల్ల ఆ జిప్ అలాగే ఉండి ఇతర దుస్తులకు అంటుకోదు.
3. వాషింగ్ మెషీన్‌లో దుస్తులను వేసేటప్పుడు వాటి లోపలి వైపు బయటికి వచ్చేలా దుస్తులను తిప్పి మెషీన్‌లో వేయాలి. దీని వల్ల అవి మెషీన్‌లో సులభంగా తిరుగుతాయి. మురికి కూడా సులభంగా వదిలిపోతుంది.
4. వాషింగ్ మెషీన్‌లో డిటర్జెంట్‌ను సరైన మోతాదులోనే వాడాలి. తక్కువగా వాడితే దుస్తులు శుభ్రం అవవు. అదే డిటర్జెంట్ ఎక్కువైతే అది దుస్తుల నుంచి అంత సులభంగా వదలదు. దీంతో ఎక్కువ సేపు దుస్తులను ఉతకాల్సి వస్తుంది. దీని వల్ల దుస్తులు పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది.
5. మరకలు అంటిన దుస్తులను విడిగా ఉతికితేనే మంచిది. లేదంటే ఆ మరకలు ఇతర దుస్తులకు అంటుకునేందుకు అవకాశం ఉంటుంది.
6. డిటర్జెంట్‌తోపాటు ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్‌ను కూడా వాడడం ఉత్తమం. ఎందుకంటే అది దుస్తుల రంగును పోనివ్వదు. దీనికి తోడు దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి. పోగులు కూడా అంత త్వరగా రావు.
7. వాషింగ్ మెషీన్‌పై ఉన్న సెట్టింగ్స్‌ను కచ్చితంగా పాటించాలి. ఏయే రకమైన దుస్తులకు ఎలాంటి సెట్టింగ్స్ సరిపోతాయో చూసుకుని వాడితే దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి.
8. వాషింగ్ మెషీన్‌లో ఉన్న డ్రైయర్ కంటే దుస్తులను సహజ సిద్ధంగా ఆరుబయట ఆరేయడం మంచిది. దీని వల్ల కూడా దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి.
9. దుస్తులను ఒకసారి వేసుకున్న తరువాత చెమట వాసన రావడం లేదు కదా అని వాటిని కొందరు మళ్లీ మళ్లీ వేసుకుంటుంటారు. అయితే అలా చేయకూడదు. మన శరీరం నుంచి చెమట వచ్చినా, రాకున్నా దుస్తులను ఒకసారి వేసుకున్నాక కచ్చితంగా ఉతకాల్సిందే. అలా చేస్తేనే అవి ఎక్కువ రోజులు వస్తాయి.

No comments:
Post a Comment