ఆరోగ్యానికీ మధురం
వేసవిలో ఏం తినాలన్నా కష్టంగానే ఉంటుంది. పనిలో పనిగా సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా.. బరువు తగ్గించే తిండి తింటే.. బావుంటుంది కదూ! సమ్మర్‌డైట్‌లో అలాంటి విశేషాలు..
• కొత్తిమీరను చూడగానే రోజూ వాడుకునేదే కదాని తీసిపారేస్తుంటాం. కానీ ఎండాకాలం మీ డైట్‌లో కొత్తిమీర ప్రధానంగా ఉండేలా చూసుకోండి. అందులో పీచు, ఇనుము, జింక్, ఫొలేట్, పాస్ఫరస్, విటమిన్ కె, థియామైన్ ఇన్నేసి ఉంటాయి మరి. వేసవిలో అరోమాలా పనిచేసే గుణాలు కొత్తిమీరలో మెండు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు అవసరమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేసే గుణం కూడా ఎక్కువ. శరీరంలోని వ్యర్థాలను తరిమేసేందుకు చక్కగా ఉపకరిస్తుంది కొత్తిమీర. వీటన్నిటికంటే శక్తివంతమైన గుణం.. బరువు తగ్గించగలగడం. వేసవిలో క్రమం తప్పకుండా కొత్తిమీర తింటే ఉహించని ఫలితాలు లభిస్తాయి.
• పులపుల్లగా, తీయగా అదోరకమైన రుచిని అందించే పైనాపిల్‌ను తినడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇందులోని విశేషాలు తెలుసుకుంటే మాత్రం ఈ సమ్మర్‌లో కూల్‌గా లాగించేయాలనిపిస్తుంది. ఇంట్లో చేసుకునే స్మూతీలు, జ్యూస్‌లలో పైనాపిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో ఎండలవేడికి జీర్ణవ్యవస్థ అదుపు తప్పుతుంది. అటువంటి పరిస్థితులను చక్కదిద్దే ఎంజైమ్‌లను వృద్ధి చేసే మంచి గుణం పైనాపిల్‌కు ఉంది. బ్లడ్‌క్లాట్స్ ను రాకుండా కాపాడేందుకు ఉపకరిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్‌గాను ప్రముఖపాత్ర పోషిస్తుంది. శరీరంలోని వాపులను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఇందులోని అత్యధిక పీచు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. తద్వార కొవ్వు బాగా తగ్గుతుంది.
• వేసవిలో మామిడిపండు సంగతి చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు మామిడిపండ్ల మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే వేసవి వెళ్లిపోతుంది. అలామాత్రం మీరు మిస్ అవ్వకండి. సీజన్‌లో మామిడి చేసే మంచి అంతాఇంతా కాదు. మైమరపించే రుచిని ఆస్వాదించడమూ ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒక పండును తింటున్నప్పుడు దొరికే సంతృప్తిని కనక లెక్కగడితే.. మామిడి మాధుర్యం ముందు మరొక పండు నిలబడదు. ఇందులో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ పుష్టిని కలుగజేస్తాయి. జీర్ణప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మామిడి.
• వేసవిలో దొరికే అద్భుత పోషకవిలువలున్న పండ్లలో అంజూర కూడా ఒకటి. వేసవితాపానికి శరీరంలో పోటాషియం నిల్వలు తగ్గిపోవడం సహజం. అదే సమస్య రోజూ కొనసాగితే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లినట్లే. అంజూరతో అత్యధిక పొటాషియం లభిస్తుంది. ప్రతి రోజు ఒక అంజూరను తింటే వేసవితో వచ్చే సగం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

Thank For Sharing Great Information About Liver Function Test. Genestrings Aims To Be The Company That Best Understands And Satisfies The Service Needs For Genetic Testing In India. It Has Been Conceived With The Idea Of Providing High End Diagnostic Services To The People Of India.
ReplyDelete