WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 16 May 2016

INFORMATION ABOUT LORD SHIVA PUJA PRAYERS IN TELUGU


రెండుపాళ్ళు కస్తూరి, నాలుగు పాళ్ళు చందనం,మూడుపాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
వాసన గల పుష్పాలతో లింగం తయారుచేసి పూజిస్తే భూమినీ,రాజ్యాన్ని పొందవచ్చు.
స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని గోశకలింగం అంటారు.
నాలుకా లింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాయుజ్యం కలుగుతుంది.
యవగోదూమశాలిజలింగం అనగా జొన్నలు,గోధుమలు,బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది,ధనం వర్ధిల్లుతుంది.
సీతాఖండలింగం- పటిక బెల్లం తో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది.
తిలపిష్టలింగం- నువ్వులను రుబ్బి ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.
భస్మలింగం- భస్మలింగ పూజ సర్వ ఫలప్రదం.
గుడలింగం- బెల్లముతో కాని,చక్కెరతో కాని చేసి పూజిస్తే సుఖాలన్ని కలుగుతాయి.
వంశాంకురలింగం- వెదురు చిగుళ్ళతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది.
పిష్ఠలింగం- పిండిలింగం విద్యాప్రదం.
దధిదుగ్ధలింగం-పెరుగులో నీళ్ళు వత్తి లింగం చేసి పూజిస్తే సంపద,సుఖం వస్తాయి.
ధాన్యలింగం-ధాన్యప్రదం.
ధాత్రీలింగం-ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే మక్తిప్రదం.
ఫలలింగం-ఫలప్రదం.
నవనీత(వెన్న)లింగం-కీర్తి,సౌభాగ్యకరం.
దూర్వాకుండజ(గరిక)లింగం-అపమృత్యునివారకం.
కర్పూరలింగం- ముక్తిప్రదం.
అయస్కాంతలింగం-అయస్కంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది.
మౌకికలింగం-ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది.
సువర్ణలింగం-బంగారు లింగం మహాముక్తిప్రదం.
రజతలింగం- వెండిలింగం సంపత్కరం.
పిత్తలలింగం- కాంస్యలింగం(ఇత్తడి,కంచు లింగాలు)ముక్తినిస్తాయి.
త్రపులింగం- ఆయసలింగం,
సీసలింగం(తగరం,తుత్తం,ఇనుము) శతృనాశకాలు.
అష్టధాతులింగం- సర్వసిద్ధిప్రదం.
అష్టలోహలింగం- కుష్ఠు వ్యాధిహరం.
వైఢూర్యలింగం- శతృగర్వ నివారకం.
స్ఫటికలింగం-సర్వకామప్రదం.
పాదరసలింగం- మహైశ్వర్యప్రదం.
రాగి,సీసం,శంఖం,ఇనుము,గాజు మన్నగువాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు.
లింగపూజ పార్వతీపరమేశ్వరుల పూజ.


No comments:

Post a Comment