పులి ..పులి.. బెబ్బులి పులి
విశ్వ నట చక్రవర్తి..యశస్వి..ఎస్ వి .ఆర్ జయంతి
హాస్య పాత్రల్లో చతు రంగారావు...!!
దుష్టపాత్రల్లో క్రూ రంగారావు...!!
ప్రతినాయక పాత్రలలో భయంక రంగారావు...!!
హాయిగొలిపేసన్నివేశాలలో టింగు రంగారావు
శ్రుతి మించని రొమాన్సులో పూల రంగారావు...!!
సినీనిర్మాతలకు డబ్బులన్దించే కొంగుబంగా రంగా రావు...!!
దయ జాలి పాత్రలలోఎంతో ఉదా రంగా రావు...!!
ఆంధ్ర ప్రజలకళాత్రుష్టన తీర్చిన నదీ తీ రంగారావు..!!
ఆయన శైలీ ఠీవీ అన్యులకు కోరంగారావు ...!!!
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు...!!
చిత్రసీమలో అహం,అసూయ లకు ఎంతో దూ రంగారావు ..!!
తెలుగువారికి భగవంతుడిచ్చిన అద్భుత వ రంగారావు ..!!
తెలుగు కళామతల్లి మేడలో మెరిసే అద్భుత హా రంగారావు...!!
No comments:
Post a Comment