WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 18 January 2016

HOW TO PRAY / PUJA MANGALA HARATHI


మంగళహారతి ఇచ్చేటప్పుడు పాటపాడాలా?
పూజ చేసిన తరవాత చివరగా మనం అందరం దేవునికి ఇచ్చే హారతినే మంగళహారతి అంటారు. ఈ హారతి ఇచ్చేటప్పుడు పాటపాడితే మంచిచి అని, అంతే కానీ తప్పనిసరిగా పాడాలని ఏమి లేదు.
పాటపాడితే ఉపయోగం ఏమిటి అంటే, అమ్మవారికి పాటంటే ప్రాణమట. మనను ఏ దేవుని పూజించినా అయ్యవారి పక్కన అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. శివునితో పాటు పార్వతి ఉంటుంది. అలానే ఆ శేషశైలనాధునికి ఆమె వక్షస్థలం పైనే శ్రీదేవిభూదేవులిద్దరు కొలువై ఉంటారు. మీరందరు గమనించే ఉంటారు, అమ్మవారు లేకుండా అయ్యవారి గుడి ఉండదు. శివలింగం ఉంది కదా అంటే, అక్కడ ఒట్టి లింగం రూపంలో శివుడు మాత్రమే ఉండరు, ఆ లింగానికి పానవట్టం ఉంటుంది, అదే అమ్మవారు. కానీ అమ్మవారికి మాత్రం విడిగా గుళ్ళు ఉంటాయి. కానీ అయ్యవారికి మాత్రం ప్రత్యేకంగా గుడి ఎక్కడా లేదు.
అలాగే మన శాస్తప్రకారం భర్త లేకపోయినా భార్యకి పూజార్హత ఉంటుంది. కానీ భార్య లేని భర్తకు పూజార్హత ఉండదు. ఈ అమ్మవారి ప్రీతి పాత్రం కోసం మనము పాట పాడితే పూజ పదిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.వ్రతాలు చేసినప్పుడు కానీ, పూజ చేసినప్పుడు కానీ, దేవాలయాల్లో కానీ హారతి సమయంలో పాట పాడితే ఆ అమ్మవారు సంతోషిస్తుంది. అప్పుడు పూజ ఫలితం పది రెట్లు పెరుగుతుంది. అందుకే తప్పక ఒక మంగళం పాట పాడాలి. దానినే మంగళగీతిక అంటారు.
ఉదా:
శ్రీలలితాదేవి పూజ చేసినప్పుడు, అమెకు హారతి ఇచ్చేటప్పుడు
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా నిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా….
అంటూ అమ్మవారికి మంగళం పాడితే, లలితా సహస్రనామం వందసారులు పారాయణ చేసిన ఫలితం పొందుతారు.
జయహారతి గైకొనవే మంగళ సౌభావతివై
శ్రీతులసి ప్రియతులసి జయము నీయవే జయము నీయవే జయము నీయవే…
అంటూ తులసి చెట్టుకు హారితి ఇచ్చేటప్పుడు ఈ పాట పాడండి. కనీసం మీకు వచ్చిన ఏదైనా మంగళగీతం ఇంట్లో పూజ చేసినప్పుడు ఆలపించండి.

No comments:

Post a Comment