WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 25 January 2016

BEAUTINESS WITH HONEY - NATURAL BEAUTY TIPS TO WOMEN IN TELUGU


అందం... మకరందం 

సహజంగా లభించే తేనె ఆరోగ్యానికే కాదు...అందాన్ని మెరుగుపరచడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.

* ఈ కాలంలో పొడిబారిన చర్మం...చాలామందిని ఇబ్బంది పెడుతుంది. సహజంగా తేమను అందించే తేనె దీనికి చక్కని పరిష్కారం. తాజా తేనెను నేరుగా ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా కనిపించడమే కాదు...తగిన తేమా అందుతుంది.

* కొందరు విధి నిర్వహణలోనో, చదువుల రీత్యానో దూర ప్రయాణాలు చేస్తుంటారు. దాంతో ముఖంపై పేరుకున్న దుమ్మూ, ధూళీ మృతకణాలను పేరుకునేలా చేస్తుంది. ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉన్న తేనెలోని ఎంజైములు చర్మ గ్రంథులను శుభ్రపరుస్తాయి. చెంచా తేనెకు అరచెంచా కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కంటి చుట్టూ ఉండే భాగాన్ని వదిలేసి మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం శుభ్రపడి, మృదువుగా మారుతుంది.

* చెంచా చొప్పున తేనె, సెనగపిండి, పాలు, పంచదార కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కళగా కనిపిస్తుంది. తరచూ చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.

* కాళ్ల పగుళ్లు వేధిస్తున్నప్పుడు.. రెండు టేబుల్‌స్పూన్ల తేనెలో కొద్దికొద్దిగా పసుపూ, కలబంద గుజ్జూ కలుపుకోవాలి. దీన్ని కాళ్లకు పూతలా రాసుకుని ఆరాక కడిగేయాలి. పగుళ్లు తగ్గి, అరికాళ్లు మృదువుగా మారతాయి.

No comments:

Post a Comment