WORLD FLAG COUNTER

Flag Counter

Sunday, 20 December 2015

THE DAY LORD SRI MAHA VISHNU APPEARS KNOWN AS MUKKOTI EKADASI



శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం

 ముక్కోటి ఏకాదశి

మంచి కోసం మన పూర్వికులు అనేక సంప్రదాయాలు ఏర్పరిచారు. మానసిక పరివర్తనతో ఆధ్యాత్మిక చింతన, పరమ పురుషార్దకరమైన మోక్షం, సదలవాట్లు పెంచుకోవడానికి ఉపవాసాది నియమాలు అందించారు. అలా రూపుదిద్దుకొన్నదే ’ఏకాదశీ వ్రతం’ ఈ ఏకాదశీ రోజున వేయి కనులతో వీక్షించి.సేవించి, తరి౦చాలని ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వమిది. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.

ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి.ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరుపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.

ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే పారణం(భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ‘ముక్కోటిఏకాదశి’ రోజున లభిస్తుందని పెద్దల మాట మానవులకి ముక్తిని ప్రసాదించడానికి శ్రీమహావిష్ణువే స్వయంగా ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించినట్లు శాస్త్ర వచనం.

No comments:

Post a Comment