WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 2 December 2015

LORD GANESH ALSO KNOWN AS VIGNA RAJA - HOW AND WHY - STORY OF GANESHA IN TELUGU


వినాయకుడికి విఘ్నరాజు పేరు వచ్చుటకు కారణం.

 వేదవ్యాసుడు పంచమవేధమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించి, ధారళంగా వచ్చే శ్లోకాలను వేంగా వ్రాయగల సమర్థుని కోసం వినాయకుని సహకారాన్ని కోరెను. అప్పుడు గణపతి ఒక నియమాన్ని విధించాడు. అదేమిటంటే వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఈ నియమాన్ని ఒప్పుకొన్న వ్యాసుడు కూడా తాను చెప్పిన దానిని పూర్తిగా అర్ధం చేసుకొనే గణపతి వ్రాయాలనే నియమాన్ని విధించాడు. వినాయకుడు కూడా అందుకు అంగీకరించాడు .

ఈ ఒప్పందం ప్రకారం భారగ కథారచన సాగింది. వేదవ్యాసుడు చెప్పినవి వ్రాస్తున్న సమయంలో వినాయకుని ఘంటము(కలం)విరిగింది. అయిననూ వ్యాసుడు ఆపక విరామం లేకుండా చెప్పసాగెను. ఆ సమయంలో వినాయకునినికి ఏమిచేయాలో తెలియక తన దంతాన్ని విరిచి దాని సాయంతో ఆపకుండా వ్రాసి భారతాన్ని పూర్తి చేసేను. అది చూచిన వ్యాసుడు విఘ్నము లేకుండా వ్రాసినందుకు నేటి నుండి నీవు విఘ్నరాజువై వెలుగొందువని వరమిచ్చెను. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది.

గణపతి శక్తి స్వరూపము: గణపతి ఆది పరాశక్తి స్వరూపము. ఆదిపరాశక్తి, గణపతి వేరువేరు కాదు. గణపతి, లక్ష్మీ, పార్వతి, సరస్వతులతో కూడి దర్శనమిచ్చుట చేత స్వామి శక్తి గణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతిగా దర్శనమిచ్చును.

వ్యాపారాభివృద్దికి: శ్వేత్కార గణపతి విగ్రహాన్ని వ్యాపార స్థలంనందుంచి ప్రతినిత్యం అర్చించి, అటుకులు, బెల్ల నివేదన చేసి గణపతి స్త్రోత్రం పారాయణ చేసినచో వ్యాపారాభివృద్దితో పాటు దృష్టి దోషం తొలగును. ప్రతి అమావాస్య రోజు కొబ్బరి కాయను శ్వేత్కార గణపతి వద్ద ఉంచి రాత్రి షాపు మూసే వేళ వినాయకుని ముందున్న కొబ్బరి కాయను దిష్టి తీసి షాపు ముందు బాగంలో పగులగొట్టి ముక్కలు ఒక ప్రక్కకు తోసి కాళ్లు, చేతులు, ముఖం నీళ్ళతో కడుక్కుని, నోరుపుక్కిలించి స్వామికి హారతినిచ్చి ప్రసాదం తీసుకున్న పిదప షాపును కట్టేయవలెను. ఈ విధంగా చేస్తే వ్యాపారం అభివృద్ది కలుగును

విజయ గణపతి మంత్రం:

సర్వకార్య సంకట నివారణవనకు సంకష్ట గణపతి మంత్రం..

ఓం నమో, హేరంబ మద మోదిక సంకష్టం మేనివారయ నివారాయ స్వాహా

No comments:

Post a Comment