నెఫ్రైటిస్ జబ్బుల్లో మూత్ర పిండానికి చేరే రక్త పరిమాణం తగ్గిన ఫలితంగా టూబ్యు లర్ ప్రొటీన్ అవక్షేపం(ప్రైసిపిటేషన్) జరిగి సిలిండర్ ఆకారంలో కాస్ట్స్ తయారవుతాయి. వీటిలో అరుణ, శ్వేత, ఎపిథీలియల్ కణాలు చోటు చేసుకోవచ్చు. ఈ కణాలు క్షీణిస్తే అవి గ్రాన్యులర్ కాస్ట్స్ అవుతాయి. అరుణ కాస్ట్స్ గ్లోమెరూలో నెఫ్రైటిస్‌ను సూచిస్తుండగా శ్వేత కణ కాస్ట్స్ పైలో నెఫ్రైటిస్‌కు గుర్తు. వాక్సీ కాస్ట్ వుంటే ఈ వ్యాధి కొంతకాలం నుంచి వున్నట్లు అర్థం చేసుకోవచ్చు. హయలిన్ కాస్ట్ ఏ తరహా నెఫ్రైటీస్‌లోనైనా కన్పిస్తాయి. ఇవి అరుదుగా జ్వరంలోను, ఆరోగ్య వంతుల్లో కూడా తీతవ్ర వ్యాయామ కనిపిం చడంవిశేషం కాబోదు. ఇక మూత్రంలో, రక్తంలో అసాధారణ దోషాలను వేర్వేరు రోగాలకు అన్వయించి చూద్దాం.
ఎక్యూట్ గ్లోమెరూలో నెఫ్రైటిస్ - తరుణ వ్యాధిగా వచ్చే ఈ జబ్బుకు టైప్-1నెఫ్రైటిస్ అని, హిమరేజిక్ నెఫ్రైటిస్ అని పర్యాయ పదాలున్నాయి. ఏదైనా ఇన్ఫెక్షన్, ఔషధ వినియోగం లేక మరేదైనా ప్రేరణకు గురైన రెండు వారాల తర్వాత రోగలక్షణాలు బయట పడతాయి.రుమాటిక్, జెనెటిక్, మెటబాలిక్ తదితర కొన్ని జబ్బుల వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. తలనొప్పి, జ్వరంతో ప్రారంభమైనా అవి అనేక అనారోగ్యాల్లో కన్పించే లక్షణాలే కనుక మొదట్లో రోగం అర్థం కాదు. ముఖ్యం గా ముఖం ఉబ్బరింపు ఈ వ్యాధిని అనుమానించడానికి ఉపకరిస్తుంది. వ్యాధి బారిన పడిన రక్తనాళాలు సరిగ్గా వడపోత చేయలేని కారణంగా మూత్రం తక్కువగా వస్తుంది. బలహీనంగా వున్న కేశనాళికల పొర ద్వారా ప్రొటీన్ జారిపోతుంది. నీరు, లవణాలు నిలబడి పోవడంతో వాపు కనిపిస్తుంది. తరుణ వ్యాధితో టిషఉ్య ఒత్తిడి తక్కువగా వున్న కంటికింద భాగంలో నీరు చేరి ఉబ్బరిస్తాయి. తరువాత పాదాలకు, యితర ప్రాంతాలకు వాపు విస్తరిస్తుంది. స్వల్పంగా రక్తపోటు పెరగవచ్చు. ఊపిరి తిత్తుల్లో నీరు నిల్వవుండి శ్వాస పీల్చుకోవ డానికి ఇబ్బంది పడతారు. ఇక ప్రయోగశాల పరీక్షల విషయానికి వస్తే మూత్రంలో రక్తంపోవడం ముఖ్యమైన అంశం. మామూలు కంటికి అనుమానించదగినం తగా వుండవచ్చు. కాకపోయినా మైక్రోస్కోప్ రిరోర్టుకు తిరుగుండదు. అరుణ కణాలకు తోడు కొన్ని శ్వేత కణాలు కూడా కనిపిం చవచ్చు. అరుణ కణ కాస్ట్‌లు కూడా కొన్ని కేసుల్లో చూస్తాం. అవి వుంటే రక్తం కిడ్నీ నుంచి స్రవించిందని రూఢి అయినట్లే. హయ లిన్, గ్రాన్యులర్ కాస్ట్ ఎలాగూ వుంటాయి. అల్బుమిన్ బాగా పోతుంది. మూత్రం కల్చర్ పరీక్షలో క్రిమి కనిపించదు. బ్లడ్ యూరియా పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం వున్నప్పటికీ బాల్య, కౌమార దశల్లో ఎక్కువగా చూస్తుం టాం. 80శాతం పైగా రోగులు చికిత్సకు స్పందించి పూర్తిగా కోలుకుంటారు. మిగిలిన వారు వ్యాధి తీవ్రతనుబట్టి త్వరగా ముదిరిపోతే కొన్ని నెలలపాటు, నిదానంగా వ్యాధి వృద్ధి చెందితే కొన్ని సంవత్సరాలు, దశాబ్దం పాటు కూడా బ్రతక వచ్చు.
పైలోనే ఫ్రైటిస్ : ఎక్యూట్ గ్లోమరూలో నెఫ్రైటిస్ రోగి మూత్రంలో రక్తం కన్పించడం ముఖ్యాంశంకాగా పైలో నెఫ్రెటిస్ కేసులో చీమురావడం ప్రధానాంశం. పైగా కల్చర్ పరీక్షలో క్రిమిని గుర్తించవచ్చు. పస్ కాస్ట్స్ కూడా కనిపించే అవకాశం వుంది. అక స్మాత్తుగా వ్యాధి పొటమరించిన ప్రారంభం లో రక్తం కూడా కన్పించవచ్చు. రోగ లక్ష ణాలు సద్దు మణిగిన తర్వాత కూడా రక్తం కనిపిస్తే రాళ్ళు , వ్రణం లేక టి.బి.ని. శంకిం చవలసి వుంటుంది.జ్వరం, చలి, వాంతులు, డొక్కలో నొప్పి, నొక్కితే మరీ నొప్పి ఈ వ్యాధి లక్షణాలు దీనికి తోడు మూత్రకోశం కూడా ఇన్ఫెక్షన్‌కు గురయితే మూత్రవిసర్జన తరచు గాను బాధగాను వుంటుంది. దీర్ఘ వ్యాధిగా మారితే ఈ లక్షణా లన్నీ అదృష్యమై రక్తపోటు పెరగడం, యూరియా నిలబి పోవడం జరగావచ్చు.
నెఫ్రోటిక్ సిండ్రోమ్- చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. పాదాలు, కాళ్ళు చేతులు కూడా నీరుపట్టి చిన్నపాటి గున్న ఏనుగులా కనిపించే పిల్లల్లో కళ్ళుమూసుకుపోయేంతగా ముఖం ఉబ్బరించి పాలిపోయినట్లుగా అట్లే తెలిసిపోతుంది. మూత్ర పిండంలో వడపోత విభాగాలు వ్యాధి గ్రస్తమవడంతో ఈ రుగ్మత చోటుచేసుకుంటుంది. అవి అనారోగ్యం కావడానికి కారణాలు బోలెడు. వాటి సంగతి అటుంచితే, మూత్రంలో ప్రొటీన్ భారీగా కోల్పోవడం ముఖ్యమైన వ్యాధి నిర్ధారణ అంశం. రోజుకు మూడు గ్రాములు పైగా అల్బుమిన్ పోతుంటే నెప్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పవచ్చు. ఒకవైపు ప్రొటీన్ కోల్పో వడం, మరోవైపు శరీరావసరాలకు ప్రొటీన్ వినియోగం పెరగడంతో రక్తంలోని ప్రొటీన్ చాలా వరకు తగ్గుముఖం పడ్తుంది. సాధార ణంగా 100 సి.సి.ల రక్తంలో ఆరు నుంచి ఎనిమిది గ్రాముల ప్రొటీన్ వుంటుంది. ప్రొటీన్ తరుగుదలను భర్తీ చేయడానికి లివర్ ఎంత ప్రయత్నించినా నష్టంతో పోటీ పడలేదు. అల్బుమిన్ పలుచబ డడంతో రక్తంలోని నీరు బయటికొచ్చేసి తిష్టవేస్తుంది. ప్లాస్మా పరిమాణం తగ్గుదల సోడియం తిరిగి పీల్చుకోడానికి,నీరు నిలబడిపోవడానికి దారితీస్తుంది. ఫలితమే ఉబ్బరింపు.ముఖం, ఆధారిత భాగాలైన కాళ్ళు, చేతులు వాపుకు గురవుతాయి. ఈ రోగుల్లో అల్బుమిన్ ఎంతగా తగ్గుతుందో కొలస్ట్రాల్ అంతగా పెరుగుతుంది. రెండేళ్లపైగా బాధపడుతున్న వారిలో కొవ్వు రక్తనాళాలలో పేరుకుపోయి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం లేక పోలేదు. మూత్ర పరీక్షలో హయలిన్, గ్రాన్యు లర్, ఫ్యాటికాస్ట్, టూబ్యూల్ కణాలు కన్పి స్తాయి. కొన్ని కేసుల్లో అరుణ కణాలు స్వల్పం గాను, మరికొన్ని కేసుల్లో భారీగాను వుండొ చ్చు. కొంతమందిలో తాత్కాలికంగా బ్లడ్ యూరియా, క్రియాటినిన్ పెరిగే అవ కాశం వుంది. ఈ జబ్బులో మూత్ర పరీక్ష తరచు గాను, అప్పుడప్పుడు రక్తంలో ప్రొటీన్స్, కొలస్ట్రాల్ యూరియా పరీక్షలు చేయించడం అవసరం.
No comments:
Post a Comment