వివాహ నాడీ దోషము
వివాహ విషయములందు, ఈ నాడీ కూటమి అత్యంత ప్రధానము. దీనిని విస్మరించుట దొషప్రదము.
ఈ మద్యన కొంత మంది ఈ విషయముకు ప్రాధాన్యత తగ్గించి " ఆ ఇప్పుడవి ఎవరు చూస్తున్నారండి "
అని నిరసించడము గమనించి ఈ విషయము వ్రాయుచున్నాను
నక్షత్రములను మూడు నాడులుగా విభజించి, కాలామ్రుత కారుడు కాళిదాస మహశయుడు.,
దీనికి ప్రాధాన్యమిచ్చి ఈ విధముగా విభజించెను
ఆదినాడి మద్యనాడి అంత్యనాడి
అశ్వని భరణి కృత్తిక
ఆరుద్ర మృగశిర రోహిణి
పునర్వసు పుష్యమి ఆశ్లేష
ఉత్తర పుబ్బ మఖ
హస్త చిత్త స్వాతి
జేష్ట అనూరాధ విశాఖ
మూల పుర్వాషాడ ఉత్తరాషాడ
శతభిషం ధనిష్ఠ శ్రవణం
పూర్వాభాద్ర్హ ఉత్తరాభాద్ర రేవతి
ఈ విధానమునే చాలా గ్రంధములు అంగీకరించినవి. వధూవరుల నక్షత్రములు ఆది, మద్య, నాడులందున్న అరిష్థము. అంత్యనాడియందున్న వధువుకు మృత్యుప్రదము. ఇది అంగీకార యోగ్యము కాదు.
ఈ నక్షత్రములను చూచునపుడు ఇరువురకు జన్మ నక్షత్రమునుండి కాని.,
నామనక్షత్రము నుండి గానీ చూడవలెను. ఒకరికి జన్మ నక్షత్రము, వేరొకరికి
నామ నక్షత్రము చూడకూడదు. మేనమామ కుమార్తెను వివాహము చెసుకొను నప్పుడు
ఈ పొంతనము చూడనవుసరము లేదు.
ప్రస్తుత కాలమున కొందరు నక్షత్రములలొ, పాద బేధ మున్న తప్పులేదనియు,
శాంతులు, జపములు చేసుకొన్న దొషము పరిహార మగునని నచ్చ చెప్పి,
వివాహములు కుదుర్చుచున్నారు. అది ఎంత మాత్రము, ఆమోద యొగ్యము కాదు.
ఈ నక్షత్రములు ,చతుష్పాద ,త్రిపాద, ద్విపాద ,నక్షత్రములు గా విభజించి ఏ నక్షత్రము
ఏ నాడి అగునొ, శాస్త్రమున తెలియపరచిరి. ఆ వివరముల జోలికి పోకుండా, సామాన్యులకు,
అవగతమగు విధముగా మనవిచేసితిని.
No comments:
Post a Comment