WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 7 December 2015

GENERAL DEVOTIONAL FACTS IN TELUGU - MUST FOLLOW - KALASARPA DHOSHA NIVARANA ARTICLES


కాలసర్పదోషం వల్ల వచ్చే దోషాలు తగ్గడానికి రాగితో చేసిన సర్పం ఉంగరాన్ని ఉంగరం వేలుకు ధరించాలి. ప్రతి మంగళవారం పగలు పాలు, పండ్లు తీసుకుంటూ జంటనాగులకు పాలుపోసి, రాత్రికి భోజనం చేయవచ్చు.
గురుబలం తక్కువగా ఉన్నప్పుడు పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది.
రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శనివారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా పైల్స్, పుండ్లు, దీర్ఘవ్యాధులు ఉపశమిస్తాయి.
ఇంటర్వ్యూల్లో విజయానికి, గురుబలం వృద్ధి చెందడానికి
చతురస్రాకారంలో ఉండే వెండి ముక్కను పసుపు గుడ్డలో చుట్టి, దగ్గర ఉంచుకోవాలి. దీని వల్ల గురుబలం వృద్ధి చేంది, ఇంటర్వ్యూల్లో విజయం లభిస్తుంది
సప్తాశ్వరథారూఢుడైన సూర్యుడు, ఇంకా విశేషంగా ద్వాదశాదిత్యుల చిత్రపటాన్ని తూర్పు దిక్కుగా ఉంచి, ఉదయం 6 నుంచి 7 లోపు సూర్యాష్టకాన్ని పఠించాలి. దీనివల్ల సకల గ్రహదోషాలు తొలగి, ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. ఏలినాటి శని జరుగుతున్న వారు మాంసాహారాన్ని మానేసి, దీన్ని పాటించడం వల్ల శనిదోషం తగ్గుతుంది.
త్రిపుష్కర యోగం
మధ్యాహ్నం 1-47 నుంచి రోజంతా త్రిపుష్కర యోగం ఉంది. ఈ యోగం లో ఏం చేసినా, తిరిగి అదే జరుగుతుంది. అందుకే ఈ సమయంలో మంచి పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు శివాలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం దిక్కుగా నువ్వుల నూనెతో 44 రోజుల పాటు దీపారాధన చేయాలి.
ఆకస్మికంగా ఆదాయం తగ్గుతుంటే ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయంలో ఇత్తడి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, 5 వత్తులు వేసి, 5 ముఖాలుగా వెలిగే విధంగా 44 రోజులు దీపం పెట్టాలి.
తరచూ అనారోగ్యాలు కలుగుతుంటే రావి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.
పితృదేవతలు శాంతించేందుకు మేడి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.

No comments:

Post a Comment