WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 7 December 2015

CHAPTER 21 - KARTHIKA PURANAMU KATHALU


కార్తీక పురాణము 21వ అధ్యాయము-కార్తీక పురాణము

పురంజయుడు కార్తీకప్రభావము నెరంగుట

ఈవిధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భుపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు, సింహనాదములు చేసికొనుచు, శూరత్వవీరత్వములను జూపుకొనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు,శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములును వీయ కాక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు - హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాలవలె పడియున్న యేనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుధ్ధమున వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులను తిసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి.అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్దసైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.

దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మప్రవర్తుడవై వున్నందుననే యీ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి. ఇప్పటికైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని యెఱింగియు, నీవు చింతతో కృంగిపోవుటయేల? శత్రురాజులను యుద్ధములో జయించి, నీరాజ్యమును నీవు తిరిగిపొందవలెనన్న తలంపుకలదేని, నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికానక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లుచేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్టసహవాసము చేయుట చేతగదా నీకీ అపజయము కలిగినది? గాన లెమ్ము. శ్రీహరిని మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు" మని హితోపదేశము చేసెను.

శ్లో|| అపవిత్రః పవిత్రో వా నానావస్థాన్‌ గతో పివా

యః స్మరే త్పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః||

No comments:

Post a Comment