WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 30 November 2015

USE PAPAYA MILK TO REMOVE WARTS - PULIPIRI KAYALU


పులిపిరికాయలు... బొప్పాయి పాలతో రాలగొట్టండి.

శరీరంపై చిన్నచిన్న పొక్కులుగా వచ్చే పులిపిరికాయలు కాస్త గట్టిగా కూడా ఉంటుంటాయి. ఈ పులిపిర్లు సాధారణంగా ముఖం, చేతులు, కాళ్లపై వస్తుంటాయి. ఇవి వైరస్ క్రిముల వల్ల కలుగుతాయి. వీటితో బాధ లేకపోయినప్పటికీ ముఖంపై వస్తే చూసేందుకు ముఖం వికృతంగా ఉంటుంది. వీటిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...
బొప్పాయి చెట్టు పాలను పులిపిరికాయల మీద రాస్తూ వుంటే క్రమేపీ అవి రాలిపోతాయి. ఇంకా చిత్రమూలము వేరును నీటిలో అరగదీసి, ఆ గంధమును పులిపిరికాయల మీద రాస్తుంటే తగ్గుతాయి.
సబ్బు, సున్నము రెండూ సమపాళ్లలో కలిపి, పులిపిరికాయలపై అద్ది ఉంచుతుంటే కొన్ని గంటలలో ఇవి చర్మము నుండి ఊడిపోవడం జరుగుతుంది.

No comments:

Post a Comment