సోమేశ్వరస్వామి దేవాలయం పశ్చిమగోదావరి జిల్లా
భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది; చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. చంద్ర-ప్రతిష్ట అగుటచే పొర్ణమికి శ్వేతవర్ణంతోనూ, అమావాస్యకు గోధుమ వర్ణంతోనూ ప్రకాశించుట ఈ లింగ మహత్యం.
ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.
శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి బూడిద/గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో దర్శనమిస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉపస్థితమై ఉన్నది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారమును దర్శించవచ్చును. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
* స్థలపురాణం
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి పడిందని. అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్రప్రతిష్టితమని విశ్వసించబడుతుంది.ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.
పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.