జాతకం ఎప్పుడు వేయించాలి?
ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు అనేక అపోహలతో బిడ్డలకి 12 ఏళ్ళదాకా బాలారిష్టాలుంటాయి, అందుకే 12 ఏళ్ళు దాటితేగానీ జాతకం వేయించకూడదంటారు. కొందరు బిడ్డ పుట్టగానేనో, పురిటి స్నానం కాగానేనో, లేదా వీలయినంత తొందరగా వేయిస్తారు.
బిడ్డ పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకూ మాత్రమే బాలారిష్టాలుంటాయంటారు. నిజమే. మరి 12 సంవత్సరాలదాకా జాతకం వేయించకపోతే ఏమైనా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు వుంటే శాంతులు ఎప్పుడు చేయిస్తారు. అఫ్ కోర్స్ ఇవ్వన్నీ నమ్మకాలున్నవాళ్ళకేననుకోండి . కొన్ని సార్లు జన్మ నక్షత్రం బాగా లేదని శాంతి చేయిస్తారు.
అంతేకాదు. బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏ చెడ్డ పని చేసినా దాని బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే బిడ్డ 12 సంవత్సరాలవరకు తల్లిదండ్రులపై ఆధారపడుతూ సొంత ఆలోచనావిధానం ఉండదు.అందుకే బిడ్డ పుట్టిన తర్వాత వీలయినంత త్వరలో జాతకం వేయిస్తే, ఏవైనా గ్రహ శాంతులు వగైరాలు అవసరమైతే చేయించవచ్చు. అదీగాక జాతకం ప్రకారం బిడ్డ ఎలాంటి మనస్తత్వం కలవాడై వుంటాడో కూడా తెలుస్తుంది. ఆ విషయాలు ముందు తెలుసుకోవటం ద్వారా ఆ బిడ్డని ఉత్తమ వ్యక్తిత్వం కల వ్యక్తిగా తీర్చి దిద్దటానికి తల్లిదండ్రులకి సహాయంగా వుంటాయి.
ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు అనేక అపోహలతో బిడ్డలకి 12 ఏళ్ళదాకా బాలారిష్టాలుంటాయి, అందుకే 12 ఏళ్ళు దాటితేగానీ జాతకం వేయించకూడదంటారు. కొందరు బిడ్డ పుట్టగానేనో, పురిటి స్నానం కాగానేనో, లేదా వీలయినంత తొందరగా వేయిస్తారు.
బిడ్డ పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకూ మాత్రమే బాలారిష్టాలుంటాయంటారు. నిజమే. మరి 12 సంవత్సరాలదాకా జాతకం వేయించకపోతే ఏమైనా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు వుంటే శాంతులు ఎప్పుడు చేయిస్తారు. అఫ్ కోర్స్ ఇవ్వన్నీ నమ్మకాలున్నవాళ్ళకేననుకోండి
అంతేకాదు. బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏ చెడ్డ పని చేసినా దాని బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే బిడ్డ 12 సంవత్సరాలవరకు తల్లిదండ్రులపై ఆధారపడుతూ సొంత ఆలోచనావిధానం ఉండదు.అందుకే బిడ్డ పుట్టిన తర్వాత వీలయినంత త్వరలో జాతకం వేయిస్తే, ఏవైనా గ్రహ శాంతులు వగైరాలు అవసరమైతే చేయించవచ్చు. అదీగాక జాతకం ప్రకారం బిడ్డ ఎలాంటి మనస్తత్వం కలవాడై వుంటాడో కూడా తెలుస్తుంది. ఆ విషయాలు ముందు తెలుసుకోవటం ద్వారా ఆ బిడ్డని ఉత్తమ వ్యక్తిత్వం కల వ్యక్తిగా తీర్చి దిద్దటానికి తల్లిదండ్రులకి సహాయంగా వుంటాయి.
No comments:
Post a Comment