WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 25 September 2014

TELUGU STORY ABOUT SAMAVARTHANAM - STUDY PERIOD


సమవర్తనం అంటే ఏమిటి?

విద్యాభాస కాలాన్ని బ్రహ్మచర్య కాలంగా చెప్పబడుతుంది. బ్రహ్మచారి తన విద్యాభాసం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, తల్లిదండ్రులు మరియు బంధువులు అతనికి మంగలహారతులచ్చి సాదరంగా ఆహ్వానిస్తారు. బ్రహ్మచారితో పాటు అతని గురువు మరియు తోటి విద్యార్థులు కూడా సాదరంగా సకల మర్యాదలతో ఆహ్వానించడం జరుగుతుంది.

విద్యాభాస కాలంలో గురువు విద్యార్థికి తండ్రిలా తన బాధ్యతలన్నీ నిర్వహిస్తాడు. కావున అట్టి గురునికి తగిన ఆసనమేసి కూర్చుండబెట్టి, పుష్పమాల వేసి బహుమతులిచ్చి విద్యార్థి తల్లిదండ్రులు ఆదరిస్తారు. గురువు తన సిష్యుదిని దీవించి సమావర్తన కార్యాన్ని పూర్తి చేస్తాడు.

నేటి కొత్త తరం వారికి ఈ సమవర్తనములో ఎత్తి విశేషము కనిపించకపోవచ్చు, కానీ అది ఎంతో అర్థమైనటువంటింది. జ్ఞానాన్ని ఆర్జించిన విద్యార్థిని మరియు జ్ఞానాన్ని విద్యార్థికి అందించిన గురువును గౌరవించి ఆడరించడమంటే పరోక్షంగా జ్ఞానాన్ని ఆరాధించినట్లే అవుతుంది. ఈ కార్యంలో గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా గౌరవించి గుర్తించబడుతుంది.

No comments:

Post a Comment