WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 1 September 2014

DEVOTIONAL ARTICLE ON ASTA VINAYAKULU - TEMPLES OF ASTA VINAYAKULU


అష్టవినాయకులు

ఈ అష్టవినాయకుల వైశిష్ట్యం ఏమిటంటే ఇవి అన్నీ
స్వయంభూలు కావడమే కాకుండా స్థలపురాణంలో
మరియు ఆలయ నిర్మాణంలో, విగ్రహరూపంలో వేటి
ప్రాశస్త్యం వాటిదే. అందుకే ఒకే యాత్రలో ఈ ఆలయాలన్నీ
సందర్శించడం ముక్తిదాయకంవా
భావిస్తారు భక్తులు. ఈ అష్టవినాయక క్షేత్రాలన్నీ
మహారాష్ట్ర (పూణే కి చుట్టుపక్కల) లోనే ఉన్నాయి. వీటిలో
మరొక విశేషమంటే ఒకే యాత్రలో అన్ని
క్షేత్రాలు దర్శించుకున్న తరువాత మళ్ళి మొదట
దర్శించిన క్షేత్రాన్ని వస్తేనే లేక దర్శిస్తేనే యాత్ర
పరిపూర్ణమవుతుంది.

ఈ క్షేత్రాల వివరాలు:

(1) మయూర గణపతి ::
శాస్త్రప్రకారం అష్టవినాయకుళ్ళలో ముందుగా
బారామతి తాలుకాలోని మోర్గావ్ గ్రామంలో వెలసిన
మయూరేశ్వరుణ్ణి దర్శించాలి అంటారు. ఇక్కడ
వినాయకుడు మూషికవాహనం మీద కాకుండా
మయూరాసనుడై దర్శనమిస్తాడు.
పూర్వం సింధురాసురుడు అనే
రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా
హింసింస్తుంటే, మునులు,
దేవతలను వేడుకోగా, వినాయకుడు మయూరాసనుడై
వచ్చి ఈ రాక్షసుణ్ణి సంగరించాడట. అందుకే
ఇక్కడి స్వామిని మోరేశ్వర్ అంటారు. పాండవులు ఈ
వినాయకుణ్ణి పూజిఖ్ంచారనీ, అసలైన ఆ ప్రతిమ
ప్రస్తుత విగ్రహానికి వానక ఉందనీ చెబుతారు.
దూరంనుంచి నాలుగు మినార్లతో మసీదులాగా
కనిపించే ఈ ఆలయాన్ని, బహమనీల కాలంలో నిర్మించారు.
అసురసంహారంగావించిన స్వామి కాబట్టి, ఈ క్షేత్రంలో
వినాయక చవితితో పాటు విజయదశమి వేడుకలు కూడా
వైభవంగా జరుపుతారు.

(2) బల్లాలేశ్వరుడు :: అష్టక్షేత్రాల్లోను ఓ
భక్తుడి పేరున వెలసినవాడే పాలిలోని ఈ
బల్లాలేశ్వరుడు. పల్లిపూర్ కి చెందిన కల్యాణ్ సేఠ్ కి
కొడుకైన బల్లాల్, స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లి, ఓ
రాతి వినాయకుణ్ణి నిత్యం పూజించేవాడాట. దాంతో
రోజూ ఆలస్యంగా ఇంటికి వస్తున్నా పిల్లల్ని చూసి
తల్లిదండ్రులు సేఠ్ కి చెప్పగా, కోపం పట్టలేక
ఆటను పిల్లవాణ్ణి చెట్టుకు కట్టి కొడతాడట.
అపస్మారక స్థితిలో కూడా బల్లాల్ గణేశుణ్ణే స్మరించగా,
స్వామి ప్రత్యక్షమై కట్లు విడిపించి, ఆ బాలుడి కోరిక
మేరకు అక్కడే ఉన్న ఓ పెద్దరాతిలోకి ఐక్యమవుతాడు.
ప్రస్తుతం ఆలయంలోని విగ్రహం అదేనని
చెబుతారు. విగ్రహరూపం కూడా ఆలయానికి వెనుక
ఉన్న కొండను పోలి ఉండటం విశేషం. ఇక్కడి
వినాయకుడికి మోదకాలు కాకుండా బేసన్
లడ్డూ ప్రసాదంగా పెడతారు. పూర్వకాలంనాటి చెక్క
ఆలయాన్ని తరవాత రాతి ఆలయంగా నిర్మించారు. దీనికి వెనకే
దుండి వినాయకాలలయం ఉంటుంది. బల్లాల్ తండ్రి
విసిరికొట్టిన విగ్రహమే ఈ దుండి వినాయకుడు.
అందుకే అక్కడ స్వామి పడమట దిశగా ఉంటాడు.
భక్తులు ముందుగా దీన్ని దర్శించాకే బల్లాల్
విగ్రహాన్ని పూజిస్తారు.

(3) చింతామణి గణపతి :: భక్తుల
నీరాజనం అందుకుంటున్న ఈ విఘ్ణేశ్వరుని
ఆలయం పూణే కు 22 కి.మీ. దూరంలో ధేపూర్
గ్రామంలో ఉంది. పూర్వం కపిల మహాముని దగ్గర
భక్తుల కోరికను నెరవేర్చే చింతామణి ఉండేదట. ఒక
సారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత్
మహారాజు కొడుకు గుణ, ఆశ్రమానికి
వచ్చినప్పుడు, ఆ మణి ప్రాశస్త్యాన్ని గుర్తించి,
దాన్ని అపహరిస్తాడు. అప్పుడా ముని గణపతి సహాయంతో
యుద్దంచేసి తిరిగి మణిని పొంది, కదంబ
చెట్టుక్రింద ఉన్న వినాయకుడి
మెడను అలంకరింపజేస్తాడు. అప్పటినుంచి ఆ
ఊరు కదంబనగర్ గాను, స్వామి చింతామణి
వినాయకుడిగాను పేరొందాడు. పేశ్వాకాలంలో ఇక్కడ
ఆలయాన్ని నిర్మించారు.

(4) విఘ్నహరుడు :: ఓఝర్ పట్టణంలో కుకడి నది
ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో రిద్ధి, సిద్ధి సమేతంగా
కొలువుదీరాడు గణపతి. పూర్వం ఈ ప్రాంతంలో
విఘ్నాసురుడు అనే
రాక్షసుడు మునులను హింసించేవాడట.
అప్పుడు వాళ్లు ఏకదంతుణ్ణి వేడుకోగా, స్వామి
రాక్షసుడు చేయగా, గెలువలేని ఆ అసురుడు,
వినాయకుని శరణుకోరి తన పేరుమీద స్వామిని అక్కడే
కొలువుండాలని కోరగా, గణేశుడు, శ్రీ విఘ్నేశ్వర్
లేదా విఘ్నహార్ వినాయక్ అని పేరుతో వెలిసాడు. అప్పట్లో
స్వామికి మునులి కట్టించిన ఆలయాన్ని, చిమాజి అప్ప
పుర్నర్మించాడు.

(5) వరద వినాయకుడు :: పూణేకి సుమారు 80
కి.మీ. దూరంలోని మహద్ క్షేత్రంలో వెలిసిన స్వామి వరద
వినాయకుడిగా భక్తుల
పూజలు అందుకుంటున్నాడు. పూర్వం ఈ
ప్రాంతాన్ని పాలించిన రుక్మాంగదుడనే మహరాజు ఒక
సారి ఈ గ్రామంలోని వాచక్నవి ఋషి దర్శనార్థం వస్తాడట.
ఋషిపత్ని ముకుంద రాజుని చూసి మనసుపడగా
రాజు తిరక్సరించి వెళ్లిపోతాడు.
అప్పుడు ఇంద్రుడు రాజు రూపంలో వచ్చి
ముకుందతో కలువగా,
గృత్సమధుడు అను కొడుకు పుడతాడు.
పెరిగి పెద్దైన తరువాత, తన జన్మ రహస్యాన్ని
తెలుసుకొని, అందరి
పాపాలు తొలగిపోయేందుకు గణపతిని ప్రార్థించగా,
అతని భక్తికి మెచ్చి అక్కడే స్వయంభువుగా వెలసి వరద
వినాయకుడుగా సుప్రసిద్దుడయ్యాడట. ఈ గుడిలోని
దీపం 1892 నుంచి అఖండంగా వెలుగుతూనే
ఉంది.

(6) గిరిజాత్మజ్ వినాయక్ :: లేన్యాది పర్వతంమీది వుద్ద
గుహల సముదాయంలో కొలువుదీరినవాడే ఈ
గిరిజాత్మజుడు. పార్వతీదేవి కుమారుడు అని
అర్థం ఉన్న ఈ దేవాలయం పూణేకు 90 కి.మీ.
దూరంలో ఉన్న ఈ వినాఉయకున్ని దర్శించాలంటే 307
మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా ఏక
రాతికొండనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు.
పుత్రుడికోసం దాదాపు పన్నెండేళ్లు తపస్సు చేసి,
నలుగు పిండితో బాలబణపతిని చేసి,
ప్రాణం పోస్తుంది. పార్వతీదేవి,
కౌమారప్రాయం వచ్చేవరకు తల్లితో ఇక్కడే ఉన్నదన్నది
పౌరాణిక ప్రాశస్త్యం. నలుగు పిండితో చేసినట్లే
ఇక్కడి ప్రతిమ రూపురేఖలు కచ్చితంగా ఉండవు.

(7) సిద్ధి వినాయకుడు :: ఎనిమిది క్షేత్రాలలో ఇక్కడ
మాత్రమే కుడివైపు తొండంతో
గణేశుడు దర్శనమిస్తాడు. సిద్ధి, బుద్ధిల
సమేతంగా కొలువుదీరిన ఈ లంబోదరుణ్ణి
విష్ణుమూర్తే స్వయంగా ప్రతిష్ఠించి,
ఆలయం నిర్మించాడని స్థలపురాణం.
పూర్వం శ్రీమహావిష్ణువు మధుకైటభులనే
రాకషులను అంతమొందించేందుకు వినాయకుడి
సహాయాన్ని తేసుకుంటాడట. ప్రతిగా స్రుష్టించినదే ఈ
ఆలయం. అహ్మద్ నగర్ నిల్లాలోని శ్రీగొండ పట్టాన
సమీపంలోని చిన్నకొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని తరువాత
పేష్వాలు నిర్మించారు. ఇక్కడ వినాయకుడికి ఒక్క
ప్రదక్షిణ చేయడం అంటే కొండ
చుట్టు చేయవలిసినదే. ఈ ప్రదక్షిణ దాదాపు 30
నిమిషాలు సేపు పడుతుంది. కార్యసిద్ధి
వినాయకుడిగా భావించి కొలిచే ఈ వినాయకునికి
భక్తులు ప్రదక్షిణలు చేసి తమ
మొక్కును తీర్చుకుంటారు.

(8) మహాగణపతి :: తన వరసిద్ధి ప్రభావంతో లోక
కంటకుడుగా మారిన త్రిపురాసురుణ్ణి
అంతమొందించేందుకు తన కుమారున్ని
తలచుకొని యద్ధం చేసి, ఆ రాక్షసుణ్ణి
సంహరిస్తాడు పరమశివుడు. ప్రతిగా ఆ హరుదే
స్వయంగా ప్రతిష్ఠించినదే ఈ రంజన్ గావ్ మహాగణపతి,
దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా విగ్రహంమీద
పడేలా నిర్మించిన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో
పేష్వాలు పునర్నిర్మించారట. సిద్ధి, రిద్ధి సమేతంగా
పద్మంలో కొలువుదీరిన వినాయకుడి విగ్రహానికి క్రింది
భాగంలో పది తొండాలు, 20 చేతులతో మహోత్కట్ గా పిలిచే
వినాయకుడి విగ్రహం ఉందని అంటారు. ఇక్కడ
నుంచి మళ్లీ మయూరేశ్వరుణ్ణి దర్శిస్తే
యాత్రాఫలం సిద్ధించినట్లే.



No comments:

Post a Comment