WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 26 March 2014

BRIEF ARTICLE ON SIMHACHALAM APPANNA


అప్పన్న సన్నిధి.. అందరికీ పెన్నిధి


ఆంధ్రప్రదేశ్‌లోని దివ్య నరసింహ క్షేత్రాలలో నాలుగు అత్యంత ప్రధాన మైనవి. వాటిలో విశిష్టత కలిగి ద్వయ రూపాలతో వరాహ నృశింహునిగా శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన పవిత్ర దివ్యధామం సింహాచలం. విశాఖపట్నానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి రమారమి 820 అడుగుల ఎత్తులో వున్న సింహగిరిపై స్వామి కొలువైవున్నాడు. 

సంపెంగలు, పొన్నలు, జాజులు, విరజా జులు, జీడిమామిడి, అనాస, పనాస మొదలైన పుష్ప, ఫల, వృక్ష శీతల ఛాయలతో ప్రశాంత వాతావరణంలో సుజల సహజ జల ధారల సమీపాన ప్రహ్లాద మండపంలో సాలి గ్రామ పీఠంపై స్వామివారు శ్రీ మహాలక్ష్మి సమేతంగా సుగంధ పరిమళ భరిత చందన చర్చితుడై భక్తులకు దర్శనమిస్తున్నాడు.ప్రహ్లాద వరదుడు వెలసిన పర్వతం సింహాకారంలో కనిపిం చడం వల్ల ఈ క్షేత్రానికి సింహాచలం అని పేరు వచ్చినట్లు ప్రతీతి. భక్త ప్రహ్లాదుడు కోరిక మేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరాహ అవతారం, హిరణ్యకశ్యపుని వధించిన నృశింహ అవతారాల కలయికతో శాంతిమూ ర్తిగా ద్వయ రూపాలతో శ్రీ వరాహలక్ష్మి నృ శింహ స్వామిగా అవతరించినట్లు స్థల పురాణం కథనం.

భూమిపై భక్తులను అనుగ్రహిం చటానికి అవతరించిన శ్రీ వరాహాలక్ష్మి నృశిం హస్వామిని భక్త ప్రహ్లాదుడు కొన్ని వందల ఏళ్ల పాటు అర్చించి తరించాడు. ప్రహ్లాద నిర్మాణా నంతరం స్వామిని పూజించే వారు కరువై ని త్య ధూప దీప నైవేద్యాలకు దూరమై, ఆలయం శిథిలమవగా స్వామివారిపై పెద్ద వల్మీకం వెలసింది. ప్రహ్లాదుని శకం ముగిసిన కొంతకాలం తర్వాత షట్‌ చక్రవర్తులలో ఒకరైన పూరూరవశ్చక్రవర్తి దేవనర్తకి ఊర్వశితో కలిసి సింహగిరిపై విహరిస్తుండగా ఒకనాటి రాత్రి స్వప్నంలో నృశింహస్వామి సాక్షాత్కరించారు. స్వామి పురూరవునితో తానున్న ప్రదేశాన్ని, తెలిపి, పుట్టను తొలగించి ఆలయ ప్రతిష్ఠ చేయవలసిందిగా ఆదేశించారు. పురూరవుడు తక్షణం నిద్ర నుండి మేల్కొని స్వామివారి ఆదేశం ప్రకారం ఆ ప్రదేశానికి చేరుకుని ఒక మాలతీ నికుంజ ప్రాంతంలో వల్మీకం (పుట్ట) ను గమనించి, దానిని తొలగించి వరాహ నృశింహునుని దర్శించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. 

ఆరోజు వైశాఖ మాసం శుద్ధ పక్ష తృతీయ (అక్షయ తృతీయ). ఏడాదిలో 364 రోజులూ పుట్టకు బదులుగా తనపై పుట్ట మట్టికి సమాన తూకపు (12 మణుగులు అంటే 500 కిలోగ్రాములు) శ్రీ చందనంను పూతగా పుయ్యాలని, ఏడాదికి ఒక్కరోజు వైశాఖ తృతీయ నాడు మాత్రమే (ఆవిర్భవించిన రోజు) స్వామి నిజరూప దర్శనం భక్తులకు కలగజేయాలని సింహాద్రినాధుడు పురూరవ చక్రవర్తిని ఆజ్ఞాపించారు. ఆ ప్రకారం నాటి నుంచి నేటి వరకు పునుగు, జువ్వాది, కస్తూరి, కర్పూరం, కాశ్మీరం వంటి సుగంధ పరిమళాలతో కూడిన శ్రీ చందనంతో ఏడాదికి 364 దినాలు కప్పబడి, ఒక్క రోజు అంటే వైశాఖ శుక్ల తదియ నాడు శ్రీ వరాహ నృశింహస్వామి నిజరూప దర్శనం భక్తులకు లభించడం ఆచారంగా వస్తోంది. 

ఆరోజు రాత్రి ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన శ్రీ వైష్ణవ స్వాములు పవిత్ర గంగధార జలాలను నియమనిష్టలతో తీసుకురాగా, అష్టోత్తర సహస్రాత్మక(1008) కలశాలతో సహస్ర ఘటాభిషేకం, పంచా మృతా భిషేకం ఫలరసాల అభిషేకాలను పవిత్ర వేదమంత్రాల నడుమ నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. అనంతరం ముందుగా అరగదీసి సిద్ధం చేసిన మూడు మణుగుల శ్రీ చందనాన్ని స్వామిపై పూతగా సమర్పిస్తారు. ఆరోజున స్వామివారి నిజరూప దర్శనం, చందన యాత్ర నిర్వహిస్తా రు సింహాచల దేవస్థానం అధికారులు.
మే నెల 2వ తేదిన చందన యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు

No comments:

Post a Comment