WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 15 March 2014

AN ARTICLE ON DYANAM - TELUGU SPIRITUAL ARTICLES



మనస్సు అంటే ఆలోచనల పుట్ట. ఆలోచనల్ని తీసేస్తే మనస్సు లేదు. ఇది మనకు ఎలా తెలుస్తుంది. గాఢనిద్రలో మనస్సూ లేదు, ఆలోచనలూ లేవు. మనస్సును నియంత్రించటం సాధ్యమే. ప్రతీోూ ధ్యానంలో మనస్సును నియంత్రించాలి. మనస్సును అదుపుచేయడం అసాధ్యం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు నిజమే అని ఒప్పుకొంటూ "మనస్సునును అదుపుచేయడం కష్టమే కానీ, అసాధ్యం కాదు" అంటూ ఎవరైతే అభ్యాసం చేస్తారో వారు మనస్సును నిగ్రహించవచ్చు అంటాడు. ప్రపంచంలోని ఋషులు, మునులు, అవతార పురుషులు అధ్యాత్మిక సాధకులు, శాస్త్రవేత్తలు అందరూ మనస్సును అదుపులో పెట్టుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అలాగే కర్మేంద్రియాల్నీ, జ్ఞానేంద్రియాల్నీ వశపరచుకోవాలి. మనం ఎంచుకొన్న లక్ష్యం వైపుకే "తైలధార"లాగ (ఒకపాత్ర నుండి మరొక పాత్రలో నూనె పోస్తున్నప్పుడు అవిచ్ఛిన్నంగా ధారపడేటట్లు) మనస్సును పంపాలి. ఏకలవ్యుడు, అర్జునుడు మొదలైన వాళ్ళు చేసింది అదే. ధ్యానంద్వారా మనస్సును నిశ్చల పరచవచ్చు. జీవితంలో అనుకొన్న లక్ష్యాన్ని సాధించిన వారందరూ మనస్సును నిగ్రహించే విజయులయ్యారు.

No comments:

Post a Comment