చుక్కకూర గుప్పెడు కట్ట1 పోపుసామాన్లు;
కందిపప్పు చిన్నగ్లాసు ఎండుమిర్చి2
ఉల్లిపాయ 1 ఆవాలు 1/2స్పూన్
పచ్చిమిర్చి 6 మినప్పప్పు 1 స్పూన్
చింతపండు నిమ్మకాయంత కర్వేపాకు 1 స్పూన్
కారం తగినంత జీలకర్ర 1/4 స్పూన్ ఉప్పు తగినంత
నూనె 2 స్పూన్లు
చేయు విధానము:
చుక్కకూర కడిగి సన్నగా తరగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు తరగాలి.
కందిపప్పు సగం ఉడికిన తర్వాత చుక్క కూర,
ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి
ఉడికించి ఉప్పు, కారం వేసి మెదిపి రెండు నిముషముల తర్వాత చింతపండు రసం తీసి వేసి
ఉడికించి దించి, బాణలిలో నూనె మరిగాక పైన చెప్పిన పోపు, ఎండు మిర్చి
ముక్కలు వేయించి వుడికించిన పోపు పప్పులో కలపాలి. తరిగిన కొత్తిమీర వేయాలి.
No comments:
Post a Comment