WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 31 January 2014

PREGNANT WOMEN NEEDS FULL REST - MUST TAKE FLUIDS - NO STRESS AND TENSION


గర్భధారణ సమయంలో 

గర్భధారణ సమయంలో మహిళలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ద్రవాలను తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకు నీరు తాగండి. 

వేవిళ్లు, వికారం వంటి సమస్యలకు అల్లం దివ్యౌషధంగా పని చేస్తుంది. అల్లం వికారంకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. చల్లని అల్లం టీని తాగడమో లేదా అల్లం వాసన చూడటమో చేయవచ్చు. 

గర్భిణీలు కంప్యూటర్‌తో మరింత జాగ్రత్త కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారికి కొన్ని సందర్భాల్లో వికారానికి దారితీయవచ్చు, ఒక వేళ అటువంటి సందర్భాల్లో మీరు కంప్యూటర్ ఉపయోగించడం పూర్తిగా నివారించాలి. కానీ మీరు తప్పనిసరిగా ఉపయోగించాలంటే జూమ్ చేసి ఉపయోగించవచ్చు.

విశ్రాంతి బాగా తీసుకోవాలి మీరు గర్భవతి అయిన తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇది మీకు మరియు మీ కడుపులో పెరిగే బేబీకి మీద బాగా పనిచేస్తుంది. విశ్రాంతి తీసుకొనేటప్పుడు మీ వెనుక భాగంలో దిండును ఎత్తుగా మీకు సౌకర్యవంతంగా వేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఆహారం తిన్న తర్వాత మరియు రాత్రి సమయంలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. మీ నిద్రకు భంగం కలిగించే విధంగా ఒత్తిడికి గురికాకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment