WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 27 January 2016

BUTTERMILK MAGAYA RECIPE


మజ్జిగ మాగాయ
కావాల్సిన పదార్ధాలు .;-

మాగాయ --- రెండు దోసేడులు
ఉప్పు -- ఒక స్పూన్
పెరుగు -- 4గరిటెలు
ఆవాలు -- అర టీ స్పూన్
మెంతులు -- ఒక టీ స్పూన్
ఇంగువ -- ఒక టీ స్పూన్
పచ్చిమిరపకాయలు --- 12
ఎండుమిరపకాయలు --- 8

తయారుచేసే విధానం ;-

ముందుగ ఒక గిన్నెలోకి జాడీ లోనుంచి మగయను తీసి పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి ను తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో 3టీ స్పూన్స్ నూనె వేసి ఆవాలు , మెంతులు ,ఇంగువ ,ఎండుమిరప ముక్కలు వేసి పోపును దోరగా వేగనివ్వాలి . అందులోనే ఇప్పుడు పచ్చిమిరప ముక్కలు ,ఉప్పు వేసి ఒక రెండు నిముషాలు ఆగి పెరుగును కొద్దిగా నిల్లు పోసి ఒక ఐదు నిముషాలు వుంచి దించేయాలి . ఈ పోపును పక్కన పెట్టుకున్న మగయలొ వేసి బాగా కలపాలి . మాగాయ ముక్కలను చేతితో చిన్న చిన్న ముక్కలుగా చిదిమితే మజ్జిగ మగయకి రుచి పెరుగుతుంది . అంతే ఘుమఘుమ లాడే మజ్జిగ మాగాయ రెడీ .... ఇది దోసకాయ పప్పుకి మంచి జోడి 

COW PUJA - HOW TO PERFORM PUJA TO COW FOR REMOVING GRAHA DHOSHAM


గోపూజతో గ్రహదోషాలు నశిస్తాయి....!

గోవును పూజించి సేవిస్తే అన్ని గ్రహదోషాలూ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి, ఒక్కోవారము, ఒక్కో ధాన్యము సూచించపడ్డాయి. ఆయా వారాలలో ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాన్ని బెల్లముతో కలిపి ఆవుకు తినిపిస్తే ఆయా గ్రహదోషాలు తొలగిపోయి గ్రహాలు శాంతిస్తాయి.

01. సూర్యుడికి - గొధుమలు, 
02. చంద్రునికి - వడ్లు,
03. కుజునికి - కందులు,
04. బుధునికి - పెసలు,
05. గురునికి - శనగలు,
06. శుక్రునికి - బొబ్బర్లు,
07. శనికి - నువ్వులు,
08. రాహువుకి - మినుములు,
09. కేతువుకి - ఉలవలు. ఇష్టమైన ధాన్యాలు.

MIRCHI RECIPE IN TELUGU


మిరపకాయ కూర

కావాల్సిన పదార్ధాలు ;-

మిరపకాయలు --- పావు కేజీ
సెనగపిండి -- 4టేబుల్ స్పూన్స్
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్స్
కారం -- ఒక టీ స్పూన్
నూనె -- ఒక టీ స్పూన్
వాము -- అర టీ స్పూన్

తయారుచేసే విధానం ;-

ముందుగ మిరపకాయలను బాగా కడిగి మధ్యలో చీల్చి పెట్టుకోవాలి . తరవాత ఒక గిన్నెలో సెనగపిండి ,ఉప్పు ,వాము ,కారం ,నూనె వేసి బాగా కలిపి చీల్చి పెట్టుకున్న మిరపకాయలలో కూరాలి . ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి కూరిన మిరపకాయలు వేసి సన్నటి సెగ మీద మాడకుండా మధ్య మధ్య లో గిన్నెను కదుపుతూ వేయించాలి . వేగిన కూర మీద ఇందాక మనం మిరపకాయలలో కూరటానికి తయారుచేసిన పొడిని జల్లి రెండు నిముషాలు ఉంచి దించేయాలి . అంతే ఘుమఘుమ లాడే మిరపకాయ కూర రెడీ ............... వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని ఈ కూర తో తింటే చాల బావుంటుంది ... కారం తినలేని వారు రెండు టీ స్పూన్స్ చింతపండు రసం కలిపి పొడిని కూరుకుని చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది