WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 2 May 2016

SOLUTION TO DANDRUFF PROBLEMS IN TELUGU


చుండ్రు సమస్యకు పరిష్కారమార్గాలు

వేసవిలో దుమ్ము, దూళి, కారణంగా ఎంత వద్దనుకొన్నా వేధించే సమస్య చుండ్రు.. చిట్కా వైద్యాలు మొదలుకొని వైద్యుల సాయంతో చికిత్సలు తీసుకొన్నా సరే చుండ్రుని తప్పించుకోవడం కష్టమే! అనిపిస్తోందా? అయితే ఆహార నియమాలు.. చిన్నపాటి జాగ్రత్తలతో చుండ్రుని అరికట్ట వచ్చంటున్నారు నిపుణులు.

గుప్పెడు మెంతులని రాత్రంతా నానబెట్టి తెల్లారి మెత్తగా రుబ్బి తలకి పట్టించాలి. ఇరవై నిమిషాల య్యాక, కుంకుడుకాయ రసంతో తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
తల స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసినా మంచిదే. చుండ్రుకి కొబ్బరి నూనె చక్కని పరిష్కారం.
తల పొడిబారి దురదతో సతమతమయ్యే వారికి నిమ్మనూనె చక్కని ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తలకు పట్టించడం వల్లా ఫలితం ఉంటుంది.
శిరోజాలు వత్తుని బట్టి గుడ్డులోని తెల్ల సొనలని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్ని జోడించాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంటపాటు ఉంచి నిమ్మ సుగుణాలున్న సబ్బుతో తలస్నానం చెయ్యాలి. చుండ్రు నెమ్మదిగా నియంత్రణలోకి వస్తుంది.
చెంచా ఆలివ్‌ నూనె, చెంచా బాదం నూనె రెండింటిని కలిపి తలకు పట్టించాలి. పావుగంట తర్వాత కడిగి తలస్నానం చేస్తే కొన్ని వారాల్లోనే చుండ్రు బాధ తగ్గుతుంది.
వేపుళ్లని తగ్గించి ఆహారంలో తాజా పండ్లు, కాయగూరలని తినడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. నాణ్యతలేని రకరకాల జెల్‌లు, షాంపూల వాడకం కూడా చుండ్రు తీవ్రతను పెంచుతుందని గుర్తుంచు కోవాలి.

BEAUTY WITH BANANA - BANANA MASAZ FACIAL TIPS IN TELUGU


బనానా మసాజ్‌

చూడగానే ఆకట్టుకునే రూపాన్ని అందరూ కోరుకుంటారు. మనిషిని చూడగానే ముందు గా ఆకట్టుకునేది ముఖం. దీనిని తాజాగా, అందంగా ఉంచు కోవడానికి రకరకాల క్రీములు ఇప్పుడు మార్కె ట్‌లో లభ్యమవుతున్నాయి, ప్రకృతి సిద్ధంగా లభించే మూలికలతో లభించే క్రీములు బోలెడు వున్నాయి. మూలికలతో పాటు ప్రకృతి మనకు ఇచ్చిన వరం పళ్ళు. ఫేస్‌ప్యాక్‌లకి, ఫేషియల్‌కి పళ్లు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలోఅరటిపండుతో ఫేషియల్‌ ముఖ వర్ఛస్సును రెట్టింపు చేస్తుంది. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుకుని అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమి షాల పాటు అలానే వుంచుకోవాలి. ఒకవేళ జిడ్డు చర్మం అయినా ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఫేషియల్‌ స్టీమ్‌ తీసుకో వాలి. ఫేషియల్‌ స్టీమ్‌ వలన చర్మం మృదువుగా మారు తుంది.

ఇప్పుడు అరటిపండు తోక్కతో ముఖం మీద తేలికగా రబ్‌ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించాలి. మృత కణాల తొలగింపు అయిపోయిన తరువాత అరటి - కోకో బటర్‌ (మసాజ్‌ క్రీమ్‌ ) కలిపి మృదువుగా పది నుంచి పది హేను నిమిషాల పాటు మసా జ్‌ చేయాలి.పోషక విలువ లున్న వీటి వలన ఎండిపోయినట్టు వున్న చర్మం మృదువుగా మెత్తగా అవుతుంది. చివరగా బనానా పాక్‌ను ముఖానికి, మెడకి పట్టించి 15 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. ఆ తరు వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచు కుంటే ముఖం అందంగా కనబడుతుంది. చౌకైన ఫేషియల్‌ ఇంట్లోనే అయిపోతుంది.

HEALTH BENEFITS WITH ThATI MUNJALU


ప్రకృతి ఇచ్చిన వేసవి వరం తాటి ముంజలు.
ప్రకృతి వరప్రసాదమైన ఈ ముంజలను ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తుంటారు. ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. కేలరీలు, విటమిన్లు అధికంగా ఉన్న ఈ ముంజలను తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.తాటి ముంజల్లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. సహజ సిద్ధమైన ముంజలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వైద్య నిఫుణులు చెబుతున్నారు. వేసవి వచ్చిందంటే తాటి ముంజలు కోసం అందరూ ఎదురుచూస్తూంటారు. కల్తీ లేకుండా ఉండే తాటిముంజలు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. మండు వేసవిలో ముంజలు తింటే ఉష్ణతాపానికి చెక్ పెట్టవచ్చు. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పిని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.శరీరం కూడా ఎంతో చల్లగా , హాయిగా ఉంటుంది. అంటువంటి తాటిముంజలు ప్రజలకు దొరికే విధంగా నగరాల్లో దర్శనం ఇస్తున్నాయి….
తాటి ముంజను తొలవగానే మధ్యలో కొంత నీరు ఉంటుంది. ఆ నీరు మాత్రం నోరూరించే రుచిగా ఉంటుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది.
ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది. వీటిలో అధికంగా తేమ, తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి చిన్నారులకు, హుద్రోగులకు, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు, స్థూల కాయులకు ఎంతాగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు దాహార్తికి కూడా మంచి విరుగుడు.ముంజల్లో ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి. వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం శ్రేయస్కరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై మొటిమలు వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది.
తాటి ముంజులలో శరీరానికి కావాల్సిన ఏ , బీ , సీ విటమిన్లు ఐరన్ , జింక్ , పాస్ఫరస్ , పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. శరీర బరువును తగ్గించడంలో కూడా ముంజులు తోడ్పడతాయి. వాటిలో అధికంగా నీరు ఉండడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. తాటి ముంజలతో కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగించడంలో దోహదపడతాయి. వేసవిలో సహజ సిద్ధంగా వచ్చే అలసట , నీరసం ముంజల తినడం వల్ల తగ్గుతాయి. వేసవిలో ఎండలు కారణంగా కొంత మందికి విరేచనాలు , వాంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది , వాటికి నిమ్మరసం ఇస్తారు , ఆ సమయంలో ముంజులు తినడం వల్ల శారీరక ఉపశమనం పొందవచ్చు. కేన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడతాయి. ట్యూమర్ , బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రో కెమికల్స్ , ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరాల్స్ , న్యూట్రిన్ లను బ్యాలెన్స్ చేయడంలో ముంజలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు..