Monday, 30 December 2013
LORD HANUMAN AND MEANING OF ANJANEYA SWAMY IN TELUGU DEVOTIONAL ARTICLES
ఆంజనేయుడు
ఆంజనేయుడు... బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం.. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి.. బ్రహ్మచారులకు ఆదర్శం హనుమంతుడు.. పెళ్లంటే మొహం మొత్తిన వారికి మంచి మిత్రుడు హనుమాన్.. అలియాస్ అంజి..కానీ, వీళ్లంతా అనుకుంటున్నట్లు హనుమంతుడు నిజంగా బ్రహ్మచారేనా? ఆయన పెళ్లి చేసుకోలేదా? ఒక వేళ చేసుకున్నట్లయితే.. ఆయన బ్రహ్మచారి కాడని తెలిస్తే.. ఈ బ్రహ్మచారుల గుండెలు పగిలిపోవూ.. హనుమంతుడు కఠిన నియమానికి, కఠోర బ్రహ్మచర్యానికి సింబల్. మరణమే లేని వరం పొందిన నవమబ్రహ్మ.. ప్రతి ఊరికీ ఆయన క్షేత్ర పాలకుడు.. అంటే కాపాడే వాడు. అలాంటి అంజి పెళ్లెప్పుడు చేసుకున్నాడు? బహ్మచర్యానికి ఆదర్శపురుషుడైన తానే బ్రహ్మచర్యానికి తిలోదకాలిస్తే.. పాపం ఆయన ఫోటో పెట్టుకుని ఘోటక బ్రహ్మచర్యం చేస్తున్న వారి గతేం కావాలి?
రామభక్త హనుమాన్ గురించి ఒకరికి ఒకరు చెప్పేదేముంది? పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా హనుమంతుడంటే ఒక విశ్వాసం.. ఆంజనేయుడి ఫోటో పక్కన ఉంటే పసివాళ్లకు ధైర్యం.. పవనసుతుణ్ణి తలుచుకుంటే పెద్దలకు బలం.. అంజిని అర్చిస్తే యువతకు బుద్ధి.. ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికి అని కాకుండా అన్నింటికీ అతీతంగా, అందరికీ ఆప్యాయంగా ఉండే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అదే ఆంజనేయుడు..
ప్రతి ఊరి ప్రారంభంలో హనుమంతుడి విగ్రహం ఉందంటే ఆ ఊరు ఆయన సంరక్షణలో ఉందని అర్థం. కాలనీ కొత్తగా వెలసిందంటే ముందుగా ఏర్పడేది హనుమంతుడి ఆలయమే..ఆ ఊరికి ఆయనే క్షేత్రపాలకుడు.. ఆ కాలనీకీ ఆయనే పాలకుడు. ఆ తరువాతే ఏదైనా.. ఇంతగా ప్రజల్లో పాపులారిటీ ఉన్న గాడ్ ఆంజనేయుడు..
మామూలుగా హనుమంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మొదటగా చెప్పేది ఆయన బ్రహ్మచర్యం గురించే..కానీ ఇప్పుడా బ్రహ్మచర్యానికే ముప్పు వచ్చిపడింది.. భావి బ్రహ్మ అయిన ఆంజనేయుడి బ్రహ్మచర్య దీక్షను సువర్చలా దేవి అనే సూర్యుని కుమార్తె భగ్నం చేసిందిట..
అంతటి కఠోర దీక్షలో ఉన్న హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం చేసుకోవటం నిజమేనా అన్న ఆశ్చర్యం కలగకపోదు.. నిజానికి ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా మనకు కనిపించే రామాయణంలో ఈ పెళ్లి తంతు లేదు.. మరి ఆ రామాయణాన్ని రాసిన వాల్మీకికి హనుమంతుడికి పెళ్లయిన సంగతి తెలుసో లేదో తెలియదు కానీ, అందులో పవన సుతుడి పాత్ర అంతా రాముడికి సేవ చేయటంతోనే సరిపోయింది..
రామాయణంలో తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించిన మన ఆంజనేయుడికి పరాశర సంహిత వంటి కొన్ని పురాణాలు హనుమంతుడిపై ప్రేమ పడి పెళ్లి చేసేశాయి. అలా పెళ్లి చేస్తే వచ్చిన భార్యే సువర్చలా దేవి.. ది డాటర్ ఆఫ్ గాడ్ సన్..
సువర్చలాదేవి.. సూర్యుని కూతురు..ఆమెను ఆంజనేయుడు పెళ్లి చేసుకున్నాడట.. హనుమజ్జయంతి రోజునే ఆయన పెళ్లి వేడుకలనూ దేశంలోని అనేక ఆలయాల్లో జరపటం ఆనవాయితీగా కూడా మారిపోయింది...
హనుమంతుడు పసివాడిగా ఉన్నప్పుడే సూర్యుణ్ణి పండుగా భావించి ఎగిరి అందుకోబోయాడట.. అలా సూర్యుణ్ణి చేరిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలనూ అభ్యసించాడు.. విద్యలన్నీ పూర్తయిన తరువాత సూర్యుడు హనుమంతుడిని కోరిక కోరాడట.. తన కుమార్తె సువర్చలా దేవిని వివాహం చేసుకోవాలన్నది ఆ కోరికట..
గురువుగారి కోరిక విని హనుమంతుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తానేమో ఘోటక బ్రహ్మచారి.. తానెలా పెళ్లి చేసుకోవటం.. అదే గురువుగారికి చెప్పుకున్నాడు.. కానీ, సూర్యభగవానుడు ఒత్తిడి చేయటంతో సంసార బాధ్యతలతో నిమిత్తం లేకుండా నామమాత్రంగా వివాహం చేసుకునేందుకు ఆంజనేయస్వామి అంగీకరించాడట.. అలా సువర్చలాదేవితో హనుమంతుడికి వివాహం అయిందని పురాణాల్లో చెప్పారు..
శ్రీరామ నవమినాడు సీతారామ కల్యాణాన్ని ఎలాగైతే జరుపుకుంటామో.. అలాగే హనుమత్ జయంతి రోజున సువర్చలాంజనేయుల వివాహాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు..
అయినా చాలామందిలో మాత్రం హనుమంతుడికి వివాహం చేయటం అనేది వింతగా కనిపిస్తోంది.. మరి కొందరిలో ఆగ్రహాన్నీ తెప్పిస్తోంది. ఏవో పురాణాల్లో ఏవేవో కథలు ఉన్నాయని చూపించి బ్రహ్మచర్యానికి ఆదర్శపురుషుడైన ఆంజనేయుడికి వివాహం చేయటం సబబు కాదని ఇంకొందరి వాదన...
పెళ్లిళు్ల చేసే వారికి మాత్రం ఇవేవీ అవసరం లేదు.. తమ స్వామి వారు బ్రహ్మచారి కానే కాదన్నది వారి బలమైన విశ్వాసం.. అదే వారికి నిజం..
హనుమంతుడి వివాహంపై చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన పెళ్లి కథ ఒకటైతే... సంతానం కథ ఇంకోటి.. ఆ సంతానంతో ఫైట్ చేసిన కథ మరోటి.. ప్రతి కథా తెగ ఇంటరెస్‌ట కలిగిస్తుంది.. ఒక్కో పురాణం ఒక్కో సందర్భంలో ఒక్కో కథనాన్ని వినిపిస్తుంది.. ఆ కథనాలు ప్రజల్లోకి ప్రచారంలోకి వచ్చేసరికి అబ్బో బోలెడు రూపాంతరాలు చెందుతాయి.
పరాశర సంహిత చెప్పిన కథనం ప్రకారం సూర్యుడి కోరికతో సువర్చలా దేవిని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడు.. ఆమెను వివాహం చేసుకున్నా.. ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టలేదట... అందుకే ఆయనకు వివాహం చేయటమూ తప్పుకాదు.. ఆయన పేరుతో బ్రహ్మచర్య దీక్షలు చేపట్టడమూ తప్పు కాదంటారు ఆధ్యాత్మిక వేత్తలు.
లంకానగరంలో సీతాదేవిని అన్వేషించటానికి హనుమంతుడు వెళ్లినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పంటించాడు.. ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు.. ఆ తరువాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్గిని ఆర్చుకుని తిరిగి వెళు్తన్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగిందిట.. తద్వారా ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది.. ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు..
ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై, మైరావణుడి ప్రాణాలకు కాపలా ఉన్నాడట.. మైరావణుడి ప్రాణాలను హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందిట.. యుద్ధం తరువాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్లాడట ఆంజనేయుడు..
హనుమంతుడి గురించి ఇలా ఎన్ని కథనాలైనా ప్రచారంలో ఉండి ఉండవచ్చు. కానీ, ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంతమాత్రం కనిపించదు.. హనుమత్ దీక్షలు స్వీకరించేవారు కొల్లలుగా ఉన్నారు.. ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగానే విశ్వసించేవారు ఎక్కువమంది ఉన్నారు.
హనుమంతుడి వివాహం అన్నది ఇప్పుడు దేశమంతటా చర్చగా మారింది.. ఆయన బ్రహ్మచర్య దీక్షకు మచ్చ పడే ప్రమాదం ఏర్పడింది.. తన భక్తుల్లో చెలరేగిన ఈ వివాదాన్ని చూసి బహుశా ఆంజనేయుడు కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు.. ఏమైనా దేవీ దేవుళ్ల విషయంలో ఇలాంటి కథలు ఎందుకు పుడతాయి? ఎలా పుడతాయి?
మన దేశంలో దేవుళ్లకు సంబంధించిన కథలు ఊరికే పుట్టవు.. ఒకే దేవుడికి సంబంధించి రకరకాల కథనాలు ఉంటాయి.. అసలు ఒక్కో దేవుడికి ఒక్కో ఆకారాన్ని కల్పించటం కూడా మన దగ్గర వింతే... ఎందుకంటే మన దేశంలో దేవతలకు సంబంధించిన అంశాల్ని డిస్కస్ చేసే పురాణాలు కానీ, ఇతర ఇతిహాసాల్లో కానీ ఒక సీక్రసీ తప్పనిసరిగా ఉంటుంది.. అంటే పైకి కనిపించే కథ వేరు...దాని వెనుక ఇండైరెక్‌టగా ఉండే ఉద్దేశ్యం వేరు...
ఈ డైరెక్టు, ఇండైరెక్టు ఏమిటని బురల్రు బద్దలు కొట్టుకోనవసరం లేదు.. చాలా సింపుల్‌లాజిక్... రామాయణం కథ కాసేపు పక్కన పెడదాం... ఇక హనుమంతుడికి కోతి రూపమే ఎందుకు ఉండాలి? జస్‌ట మీలో మీరు ప్రశ్నించుకోండి... మీకే జవాబు దొరికిపోతుంది..
పాయింట్ నెం.1
కోతి మనిషికి పూర్వరూపం అని అంటారు..
పాయింట్ నెం.2
కోతి అత్యంత చంచల స్వభావం కలిగింది.
పాయింట్ నెం.3
కోతి మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు..
పాయింట్ నెం.4
మనిషి మనసు కూడా ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది
పాయింట్ నెం. 5
ఇలాంటి చంచల స్వభావం కలిగిన వాళ్ల మనసులను స్థిరంగా ఉంచటం ఎలా?
పాయంట్ నెం.6
మెడిటేషన్ ఒక్కటే మార్గం..
పాయింట్ నెం.7
దాన్నే భక్తి అంటారు.
భక్తి అనేది ఒక కోతిని భగవంతునిగా మార్చింది.. చంచలమైన మనసు కలిగిన మనిషిని స్థిరచిత్తంతో ఉంచే లక్ష్యానికి ప్రతిరూపమే హనుమంతుడు. ఇవాళ ప్రపంచం అంతా మెడిటేషన్ చుట్టూ తిరుగుతోంది... మన అంజి, అదే ఆంజనేయుడు దీన్ని ఆనాడే చేసి చూపించాడు.. అంతే కాదు.. మానవుడైన రాముడికి సేవ చేయటం ద్వారా మనిషికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని రుజువు చేసిన వాడు హనుమంతుడు..
ఇక సువర్చలా దేవితో వివాహం సంగతి... దీని వెనుక కూడా లాజిక్ లేకపోలేదు..
ప్రపంచంలో విద్యలన్నింటికీ సింబల్ వెలుగు.. వర్చస్సు అన్నా వెలుగే..
సు.... వర్చస్సు అంటే మంచి వెలుగు అని అర్థం.. ప్రపంచంలోని ఉన్నతమైన, ఉత్తమమైన విద్యలన్నింటినీ హనుమంతుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సూర్యుడి నుంచి పుట్టిన వెలుగే ఈ విద్యలు.. ఆ వెలుగే సువర్చల.. ఆ సువర్చలనే హనుమంతుడికి సూర్యుడు అందించాడు.. సువర్చలా వివాహం అనేది సామాన్యులకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పింది.. దాని మూట విప్పితేనే కదా.. మర్మమేమిటో తెలిసేది.. దీని గురించి వితండ వాదాలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.. మన దేవతల గురించి ఆలోచించేప్పుడు వారి వెనుక పెద్దలు చెప్పిన సైంటిఫిక్ లాజిక్ ఏముందో ఒక్కసారి ఆలోచించటం అవసరం.

OM NAMAH SIVAYA - MEANING OF OM NAMAHSIVAYA MANTRAM IN TELUGU
నమశ్శివాయ :
ఓం ‘నమశ్శివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమశ్శివాయ’ అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి ‘నేను నమస్కరిస్తున్నాను’ అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. ‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం చెప్పవచ్చు. పుస్తకాలలో ‘శివుడు’ అనే పదానికి చెప్పే ‘వినాశకారుడు’ అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. శివుడు అంటే నాశనం లేనివాడు అని మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వనితతరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి.
శివుడు అంటే ‘నిరాకారుడు’ అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటుంటారు. అంటే ‘భగవంతుని అంశ’ అని అర్థం. ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం.
ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి
న, మ, శి, వ, య. మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.
అనంతమైన అర్థం పరమార్థం
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాల (పృథివ్యాపస్తేజోవాయురాకాశః) తో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. న భూమికి సంబంధించిన భాగాలను, మ నీటికి సంబంధించిన భాగాలను, శి అగ్నికి సంబంధించిన భాగాలను, వ గాలికి సంబంధించిన భాగాలను, య ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.
ఓం ‘నమశ్శివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమశ్శివాయ’ అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి ‘నేను నమస్కరిస్తున్నాను’ అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. ‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం చెప్పవచ్చు. పుస్తకాలలో ‘శివుడు’ అనే పదానికి చెప్పే ‘వినాశకారుడు’ అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. శివుడు అంటే నాశనం లేనివాడు అని మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వనితతరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి.
శివుడు అంటే ‘నిరాకారుడు’ అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటుంటారు. అంటే ‘భగవంతుని అంశ’ అని అర్థం. ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం.
ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి
న, మ, శి, వ, య. మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.
అనంతమైన అర్థం పరమార్థం
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాల (పృథివ్యాపస్తేజోవాయురాకాశః
Thursday, 26 December 2013
THE GREATNESS OF INDIAN SAINTS
హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.
ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ...
"యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను"
హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది.
లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ -12000 సంవత్సరాలు
సహస్ర -1000
యోజనం- 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే....
ఒక మైలు =1.6 కి .మీ.
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.
హిందూమతం గొప్పతనం అది.

Saturday, 21 December 2013
FIVE USEFUL LIFE TIPS FOR A HAPPY LIFE
ఆనందంగా ఉండటానికి ఐదు సూత్రాలు
1. అర్జంట్ గా టీ.వీ ముందునుండి లేవండి ..పనికి మాలిన సీరియల్స్ చూడటం ఆపి, మంచి పుస్తకం గాని, మంచి సంగీతం కాని వినండి.
2. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న, చిరాకు కలిగిస్తున్న స్నేహితుల్ని వీలైనంత దూరంగా పెట్టండి. మంచి ఆలోచనలు, వివేకం, తెలివితేటలు ఉన్న గొప్ప వారితో ఉండటానికి లేదా మాట్లాడటానికి ప్రయత్నించండి.
3. మంచి పుస్తకం తీసి దానిలో మీకు నచ్చిన విషయాలను ఒక డైరీలో రాయండి. కొన్ని మంచి అంశాలను మీ ఫేస్ బుక్ వాల్ మీద రాయండి ( రచయిత పేరు- పుస్తకం పేరు రాయడం మరచి పోవద్దు)
4. ధ్యానం, మౌనం, లేదా ఏకాంతం గా కొంత దూరం నడవటం చేయండి.
5. వీలైనంత వరకు ఎవరికో ఒకరికి ఆనందం కలిగించడానికి ప్రయత్నించండి. అవకాశం ఉన్నంతవరకు ఎంతోకొంత సహాయం ఏమీ ఆశించకుండా చేయండి.
Wednesday, 18 December 2013
WHAT IS ANTIBIOTICS - HOW DOES IT HELPS TO US
యాంటీబయాటిక్స్ అనేవి రసాయనాలు. ఈ రసాయనాలను శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు ఒక విధమైన ''జర్మ్స్'' ను చంపటంకానీ, పెరగకుండా కానీ చేస్తాయి. మైక్రోబ్స్ నుండి ఆంటీబయాటిిక్‌లను తయారు చేస్తారు. బాక్టీరియా, మోల్డ్‌లు. ఆంటీబయాటిక్‌లు. యాంటీబయాటిక్‌ల తయారీలో మెక్రోబ్స్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే వాటి వల్ల రసాయనాలు వ్యాధి మైక్రోబ్స్ మీద యుద్ధం ప్రకటించడానికి, మైక్రోబ్స్ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేందుకు నిరంతరంగా పోరాడుతూనే వుంటాయి. ఈ పోరాటంలో సంక్లిష్టమైన రసాయనాలను తమ శరీరంలో ఉత్పత్తి చేస్తాయి.
ఈ రసాయనాలను శాస్త్రవేత్తలు పరీక్షించి ఎన్నో వేరే రసాయనాలను కనుగొన్నారు. వీటివల్ల జబ్బును కలిగించే జర్మ్స్‌ను చంపవచ్చు. ఈ రసాయనాలను ప్రయోగశాలలో తయారుచేస్తే వాటివల్ల యాంటీబయాటిక్‌లు తయారు చేయవచ్చు. ఈ యాంటీబయాటిక్స్ ఏవిధంగా తయారు చేయవచ్చు. (పెన్సిలిన్ టెర్రామైసిన్, టెట్రాసైక్లిన్) ఈ యాంటీబయాటిక్‌లు జర్మ్స్ ఆక్సిజన్ అందకుండా చేస్తాయని, దీని వల్ల జర్మ్స్ విడిపోయేందుకు అవకాశం లేకుండా చేస్తూ, మనిషి శరీరంలో నుండి అవి ఆహారం తీసుకోకుండా కూడా ఈ యాంటీబయాటిక్స్‌లు పనిచేస్తాయన్నారు. ఆకలితో అవి చనిపోవడం కూడా జరగుతుందంటున్నారు. ఈ జర్మ్స్ యాంటీబయాటిక్‌లను తిని విషపూరిత మౌతాయంటున్నారు. ఒక్కోరకం యాంటీబయాటిిక్‌లు ఒక్కోవిధంగా జర్మ్స్ పైన దాడి చేస్తాయి. కొన్ని రకాలేమో జర్మ్స్‌ను చంపేస్తాయి. కొన్నేమో బలహీనపరుస్తాయి. ఈ విధంగా యాంటీబయాటిక్‌లు మనకు ఉపయోగపడుతున్నాయి. గ్రీకు పదాల అర్థమైన 'Aస్త్రaఱఅర్ ూఱటవ' అనే దాని నుండి యాంటీబయాటిక్‌లనే పదమొచ్చింది.
MAINTAIN SHINY AND BEAUTIFUL HAIR IN RAINY SEASON - TIPS FOR HAIR CARE IN RAINY / WINTER SEASON
వర్షాకాలంలో తేమ కారణంగా, చెమటకారణంగా జుట్టు రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. వెంట్రు కలు మరింత జిడ్డుగా, డ్రై వెంట్రుకలు పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి. చిట్లిపోతాయి. ఈ కాలంలో వెంట్రుకలు ఆరోగ్యంగా, మెరుస్తుండా లంటే 'హెయిర్‌స్పా' ట్రీట్‌మెంట్ చాలా అవసరం. ఈ ట్రీట్‌మెంట్‌ని పార్లర్‌లో తీసుకోవచ్చు లేదా ఇంట్లో చేసుకోవచ్చు.
'హెయర్‌స్పా' ట్రీట్‌మెంట్ కోసం ఒక గంట సమయం పడుతుంది. ఇందులో మసాజ్, మెషీన్, క్రీం, హెయిర్ మాస్క్ మొదలైనవి ఉపయో గిస్తారు. సాధారణంగా వెంట్రుకల్లో చెమట రావడం కారణంగా వెంట్రుకలు జిడ్డుగా మారతాయి. దీంతో స్కాల్ఫ్ పై మొటిమలు, చుండ్రు లాంటివి ఏర్పడి వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలాంటి వెంట్రుకలకు 'హెయిర్ స్పా' ట్రీట్‌మెంట్ అవసరం. 'హెయిర్ స్పా' ఇవ్వడానికి అన్నిటికన్నా ముందు వెంట్రుకలను షాంపు చేస్తారు. తర్వాత వెంట్రుకల టెక్టృర్, స్కాల్స్ అనుసరించి క్రీమును ఎంచుకుని 45 నిముషాల వరకు మసాజ్ చేస్తారు. ఆ తర్వాత మెషీన్‌తో వెంట్రుకలు, భుజాల్ని, వీపులో ఇలా చేస్తే వెంట్రుకలలో చెమట కారణంగా ఏర్పడే బ్యాక్టీరియా తొలగిపోతుంది.
ఆ తర్వాత 20 నిమిషాల హెయిర్ మాస్క్‌తో వెంట్రుకలకు షాంపూ చేస్తారు. ఈ 'హెయిర్ స్పా'తో వెంట్రుకలకు సంబంధించిన సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. వెంట్రుకలు సున్నితంగా మారతాయి. మెరుస్తుంటాయి. ఈ ట్రీట్‌మెంట్‌ను నెలలో 2సార్లు చేయిస్తే చాలు. కానీ వెంట్రుకలు ఎక్కువగా డ్రైగా ఉంటే 3 లేదా 4సార్లు కూడా చేయించవచ్చు.
ఇంట్లో 'హెయిర్ స్పా' చేసుకోవడానికి వేడినీళ్ళతో షాంపూ అప్లరుచేయండి. ఆ తర్వాత వేళ్ళ సహాయంతో వెంట్రుకల మూలాల్లో తేలికపాటి మసాజ్ చేయండి. వెంట్రుకలు నూనెతో తడిసేవరకు అలా చేయండి. ఆ తర్వాత వెంట్రుకలను 30నిమిషాల వరకు ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టి ఉంచండి. అరగంట తర్వాత హెయిర్ మాస్క్ వేయండి. మాస్క్‌ను తయారుచేయడానికి ఒక పండిన అరటిపండు రెండు చెమ్చాల మ్యోనిజ్, ఒక చెమ్చావేసి కలిపి పేస్టు తయారుచేసుకోండి. మళ్ళీ గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా చేస్తే డ్రై వెంట్రుకలు మళ్ళీ షైనీగా మారతాయి. స్మూత్, సాఫ్ట్‌లుక్ వస్తుంది.
WHAT ARE THE NECESSARY FOOD PRECAUTIONS TO BE TAKEN FOR BABIES HEALTH GROWTH - BABIES HEALTH CARE TIPS
ఎక్కువ శాతం పిల్లలు 6 నెలలవరకు తల్లిపాలమీద ఆధారపడిఉంటారు. అయితే 6 నెలల తర్వాత నుండి తల్లిపాలు వీరికి సరిపోవు. తర్వాత వీరి పెరుగుదలకు అవసరమైన కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. అందువల్ల 6 నెలల తర్వాత నుండి పిల్లలకు తల్లిపాలతో పాటు, పోతపాలు ఇతర ఆహారపదార్దాలను ద్రవరూపం లోగాని, ఘనరూపంలోగాని అలవాటు చేసే పద్దతిని వీనింగ్ అని అంటారు.
పాలలో విటమిన్ 'సి' తక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ 'సి'ని అందివ్వ డానికి పిల్లలకు 6 నెలల నుండి పండ్లరసా లను అందివ్వాలి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఐరన్‌నిల్వలు లివర్‌లో ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుండి 4-6 నెలల వరకూ సరిపోతాయి. తర్వాత నుండి ఆహారం ద్వారా ఐరన్ వారికి లభించాలి. పాలలో విటమిన్ 'డి' కూడా తక్కువగా లభిస్తుంది. పిల్లలు అనుకున్న రీతిలో ఆరోగ్యంగా పెరగాలి అంటే సప్లిమెంటరీ ఫీడింగ్ 6నెలల నుండి మొదలుపెట్టాలి. లేకుంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆరు నెలల తర్వాత నుండి తల్లిపాలు 3 లేక 4 సార్లు మాత్రమే ఇస్తూ ఆవుపాలుకాని, గేదెపాలుకాని అలవాటు చేయాలి. ఈ పోతపాలలో పోషకాలు తల్లిపాలతో పోలిస్తే వేరుగా ఉండటం చేత, పిల్లలు అలవాటు పడటానికి పాలలో కాచి చలార్చిన నీళ్ళను, పంచదారతో కలిపి తాగించాలి. పాలు, నీళ్ళ శాతం 2+1 గా ఉండాలి. చక్కెరవలన కాలరీలు పెరుగుతాయి. ఆరంజ్, టమాటో, ద్రాక్ష వంటి పండ్లు మంచి పోషకాలు కలిగిఉంటాయి. వీటిలో లభ్యమయ్యే పోషకాలు పాలలో దొరకవు. అందుచేత ఈ పండ్ల రసాలను పిల్లలకు కాచి చల్లార్చిననీళ్ళు కలిపి ఇవ్వడం చేయవచ్చు. నీరు, జ్యూస్ 1+1గా ఉండాలి. జ్యూస్‌ను వడకట్టి తాగించాలి. క్రమంగా జ్యూస్ మోతాదు ను పెంచుతూ, నీటిశాతం తగ్గించాలి.
పండ్లు దొరకని పరిస్థితుల్లో ప్రత్యా మ్నాయంగా ఆకుకూరల రసాన్ని సూప్ గా చేసి ఇవ్వాలి. దీనిని వడకట్టి తాగిం చాలి. తర్వాత మెల్లగా వడకట్ట కుండా అలవాటు చేయాలి. వీటితోపాటు ఫిష్‌లివర్, ఆయిల్ కొన్ని చుక్కలు నుండి అరటేబుల్ స్పూన్ కొన్ని పాలలోకలిపి ఇవ్వడం వలన విటమిన్ ఎ, విటమిన్ డి లభ్యమవుతుంది. పిల్లలకు పట్టేముందు జ్యూస్‌లను బాగా కలపాలి. జ్యూస్, సూపులు నుండి మెత్తని ఆహారాన్ని 7 లేదా 8వ నెలలో మొదలుపెట్టవచ్చు. పెరుగు తున్న కాలరీస్, ప్రొటీన్ల ఆవశ్యకతల వల్ల వాటిని సరైన రీతిలో అందించడా నికి, బాగా ఉడికించి, మెత్తగా చేసిన తృణధాన్యాలను పాలు, చక్కెర కలిపి పెట్టాలి. క్యాలరీస్ ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్‌వీట్, రాగిని ఈ ఆహారంలో చేర్చాలి. మాల్టెట్ తృణధాన్యాలు అంటే వాటిని రాత్రంతా నానబెట్టి, ఒక గుడ్డలో మూటకట్టి, మొలకలు వచ్చిన తర్వాత ఎండలో ఎండబెట్టి, ఎర్రగా వేయించు కోవాలి. తర్వాత మొలకలు తీసేసి పౌడర్ చేసుకోవాలి. ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యారెట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్, ఖనిజాలు లభ్యమవుతాయి. అలాగే ఈ ఆహార పదార్ధాల వల్ల పిల్లలు కలర్ ఫుడ్‌కి అల వాటు పడతారు.
బాగా ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. ఉదా: కిచిడి, పొంగలి, పెసరపాయసం వంటివి. వీటిని పలుచగా కానీ లేదా కొద్దిగా సెమీసాలిడ్‌గా కానీ పెట్టవచ్చు. పప్పుధాన్యాలు ఇచ్చిన రోజు గుడ్డు, మాంసం ఇవ్వవలసిన అవసరం లేదు. అవి మరొక రోజు ఇస్తే పిల్లలకు కావలసిన శక్తి లభిస్తుంది. పిల్లలు చేతితో తీసుకుని కొరికి తినే సమయం అంటే 10-12 నెలల సమయంలో ఇలాంటి ఆహారం అందించాలి. బాగా ఉడికించిన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, మాంసం పండ్లు పెట్టాలి. ఇడ్లీ, ఉప్మా, బ్రెడ్, చపాతి, అన్నం, పప్పు వంటివి అలవాటు చేయాలి. చిన్నగా తరిగిన పండ్లు, కూరగాయలలో గింజలు ఉంటే అవి తీసేసి ఇవ్వాలి. వీటివల్ల దవడలకు మంచి ఎక్సర్‌సైజ్ లభిస్తుంది. ఎందుకంటే పిల్లలు నమిలితింటారు. కాబట్టి ఎక్కువగా శ్రద్ధచూపించే తల్లి, ఎక్కువగా ఇంట్లోచేసిన వీనింగ్‌ఫుడ్స్‌నే ఇవ్వాలి. వీటిని తృణధాన్యాలు, పంచదార, బెల్లం, పాలతో ఇంట్లోనే తయారు చేసుకోవాలి.
ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలర్జీ ఉండదు. పిల్లలు తినగలుగుతున్నారని నిర్ధారిం చుకున్న తర్వాత క్రమంగా మోతాదు పెంచుతూ మొత్తం పచ్చసొన తినిపించ వచ్చు. గుడ్డులోని యోక్‌లో విటమిన్, ఐరన్, ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవు తాయి. గుడ్డు తెల్లసొన మాత్రం సంవత్స రం తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
అందరూ తినే ఆహారం సంవత్సరం దాటిన తర్వాత చిన్న చిన్న మోతాదుల్లో పాలలో కలిపి అలవాటు చేయాలి. గొంతులో ఇరుక్కునే అవకాశం ఉన్న పప్పుదినుసులు, ఎండుద్రాక్ష, పచ్చియాపిల్, కూరగాయలు, పాప్‌కార్న్ వంటివి దూరంగా ఉంచాలి. ఎందుకంటే గొంతులో ఇరుక్కుని వీటివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బంది వస్తుంది.
MAINTAINING BLACK HAIR SO BEAUTIFUL - HAIR CARE TIPS IN TELUGU
నిగనిగలాడే ఒత్తయిన నల్లని కురులు మీ సొంతం కావాలి అనుకుంటున్నారా ఈ క్రింది చిట్కాలు పాటించండి. రోజులో వీలైనంద పరిశుభ్రమైన నీరు. రోజుకు కనీసం 12 నుండి 14గ్లాసులు తాగితే శిరోజాలకే కాదు అన్ని విధాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు జున్ను, జీడిపప్పు, పచ్చని ఆకుకూరలు, కూరగాయుల మీరు రోజు తీసుకునే ఆహారంలో ఉం డేలా చూసుకోండి. తలస్నానానికి ముందు పరిశుభ్రమైన కొబ్బరినూనె శిరోజాలకు పట్టించాలి. ఇందువల్ల శిరోజాలకు చక్కని మెరుపు, నునుపు వస్తుంది. తల స్నానం వీలైనంత వేగంగానే ముగించి శిరోజాలను ఆరబెట్టుకోండి. గంటల తరబడి జుత్తును తడిగానే ఉంచేయడం మంచిది కాదు. తలస్నానానికి ముందు పరిశుభ్రమైన కొబ్బరినూనె శిరోజాలకు పట్టించాలి. ఇందువల్ల శిరోజాలకు చక్కని మెరుపు వస్తుంది. శిరోజాలకు రంగులు వేసే అలవాటు ఎంత దూరమైతే అంతమంచిది. ఎందువల్ల నంటే దీని వల్ల 20శాతం జుట్టు కోల్పోతారు.హడావిడి సమయాల్లో త్వరగా జుత్తును ఆరబెట్టుకునేందుకు డ్రయ్యర్స్ వాడటం వల్ల పరిపాటి. ఇలా డ్రయ్యర్లు వాడటంతో ఆరబెట్టటం వల్ల జుట్టు పగుళ్ళు ఏర్పడటం, బలహీనపడి, రాలి పోవటం జరుగుతుంది. పళ్ళు దగ్గరగా ఉండి మొనదేలిన బ్రష్‌లనుఉపయోగించకూడదు. ఇందువల్ల శిరోజాలు చిట్లిపోవడం కాకుండా, మొదళ్ల భాగంలో ఉండే సున్నితమైన భాగంలో ఉం డే సున్నిత మైన చర్మం కూడా దెబ్బతినే అవకాశంఉంది.పళ్ళు దూరంగా ఉండి చివర్లు మొనదేలిన బ్రష్‌లు వాడాలి.
WHY SUDDENTLY MOOD CHANGES ? TIPS FOR FRESH MOOD IN DAILY LIFE
చాలామందికి హఠాత్తుగా మూడ్ మారిపోతుంటుంది. అసహనంగానూ, అంశాంతిగానూ, ఆందోళనగానూ ప్రవర్తిస్తారు. గతాన్ని తలచుకుని బాధపడడం, సమస్యలు ఎదుర్కొనే టప్పుడు సహనం, వివేకం కోల్పోవడం, సమస్యలకు తల్లడిల్లిపోతూ పరిష్కార దిశగా కాకుండా వ్యతిరేకంగా ఆలోచించడం, సన్నిహితుల ఎడబాటు, ఆప్తుల మరణం, ఆర్థిక పరమైన ఇబ్బందులు వారి మూడ్‌ను మార్చేస్తాయి. ఇతరుల మీద ఆగ్రహించడం, సరిగ్గా మాట్లాడక పోవడం లక్షణాలు ఏర్పడతాయి.అటువంటి వారికి తోటివారు దూరంగా వుంటారు. మూడ్ బాగాలేనట్లుంది అనుకుంటారు.
1.మూడ్ మారాలంటే... ఒక చాక్లెట్‌ను నోట్లో వేసుకుని చప్పరిస్తుండాలి.
2. చిక్కుడు, సోయాబీన్స్, అక్రూట్స్, బాదంపప్పు, ఓట్స్ లాంటివి ఆహార పదార్థాల్లో చేర్చాలి.
3.మితాహారం తీసుకోవడం మంచిది.
4. ప్రతి రోజు ఒక నిర్ణీత సమయంలోనే ఆహారాన్ని తీసుకోవాలి.
5.వ్యాయామం చేస్తే నూతన ఉత్సాహం కలిగి మంచి మూడ్‌లోకి వస్తారు.
6.విటమిన్-డి కి కూడా మూడ్‌ను మార్చేశక్తి ఉంది. అందువల్ల, సుప్ర భాత సమయంలో కానీ, సూర్యాస్తమయ సమయంలో కానీ, నీరెండలో గానీ నడవడం మంచిది. అప్పుడు, వారిలో చలాకీతనం హుషారు ఏర్పడుతుంది.
7.నెగిటివ్ థింకింగ్‌ను వదిలేసి పాజిటివ్‌గా ఆలోచించాలి.
8. మనస్సులో ఏర్పడే భావాలను అంటే దిగులు, బాధ, సమస్యలు లాంటివి అతి సన్నిహితులకు చెప్పుకుంటే మనస్సు తేలికయి మూడ్ మారుతుంది.
9.నిద్రలేమి కలిగితే శరీరంలో చురుకుతనం తగ్గుతుంది. చిరాకుగానూ నిరుత్సాహంగానూ, అశాంతిగానూ ఉంటుంది.
మూడ్ బాగా లేనప్పుడు కొంత సమయం నిద్రపోతే, ఆ తర్వాత సరైన మూడ్‌లోకి వస్తారు.
10. చేయవలసిన పనులు అధికమై, సమయం తక్కువగా
ఉంటే మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువవడం వల్ల చిరాకు, విసుగు కలుగుతాయి. అది ఏర్పడకుండా ఉండాలంటే ఇంటి పనులు విభజించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం పనులను చేసుకోవాలి. మానసిక ఒత్తిడి కలుగకుండా జాగ్రత్త పడాలి.
11.తోటపని చేయడం, పచ్చని చెట్ల మధ్య గడపడం ద్వారా ఆనందం కలుగుతుంది. చక్కని మూడ్‌లోకి రాగలుగుతారు.
CALCIUM IS ESSENTIAL FOR THE FORMATION AND MAINTENANCE OF BONES AND TEETH - FOOD SOURCES OF CALCIUM INCLUDE DAIRY PRODUCTS, GREEN LEAFY VEGETABLES, AND SALMON AND SARDINES
ఎముకల ధృడత్వానికి, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరమవుతుంది. చిన్నపిల్లల నుంచి, వృద్ధుల వరకు కాల్షియం ఎంత తీసుకోవాలన్నదీ వైద్య సలహా తీసుకుంటే మంచిది. టీనేజ్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కాల్షియం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఎముకల సాంద్రత పెరగడానికి తగినంత కాల్షియం కావాలి. కాల్షియం లోపం ఏర్పడితే ఎముకలు అతి త్వరగా విరగడం, ఫెళుసుగా మారటం జరుగుతుంది. అందువల్ల కాల్షియం లభించే పదార్థాలేమిటో తెలుసుకుని, వాటిని తీసుకుంటే శరీరానికి కాల్షియంలోపం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. రాజ్‌మా, రాగులు, శనగలు, పెసలు, మినుములు లాంటి గింజ ధాన్యాలలోనూ, ములక్కాడలు. బీన్స్, సోయాబీన్, మెంతికూర, తోటకూర, పాలకూర, కోతిమీర, కరివేపాకు లాంటి ఆకుకూరలు, తాజా కాయకూరల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. బాదం, ఎండు ద్రాక్ష, వేరుశెనగ కాయలు లాంటి వాటిలోనూ నిలవ పచ్చళ్లు, ఊరగాయలు, ఉప్పు అధికంగా వాడిన ఫాస్ట్‌ఫుడ్స్, స్నాక్స్ అప్పడాలు, ఒడియాలు లాంటివి తక్కువగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే, ఆ పదార్ధాల్లో ఉండే సోడియం కాల్షియాన్ని నష్టపరుస్తుంది. నిద్రలేమికి, ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది. మెనోపాజ్ స్థితికి చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఎముకలు త్వరగా విరుగుతాయి. వృద్దాప్యంలో ఉన్నవారు ఆహార పదార్ధాల్లో ఉప్పును తగ్గించి తినడం ద్వారా కాల్షియం లోపాన్ని నివారించవచ్చు. శరీరంలో కాల్షియం స్థాయి తగ్గితే వారిలో రక్తపోటు సమస్య కూడా ఏర్పడవచ్చు కనుక, కాల్షియం, సమృద్ధిగా లభించ టానికి పాలు, పెరుగు తీసుకోవడం మంచిది. చిన్న వయస్సు నుంచే కాల్షియం లభించే పదార్థాలు తీసుకుంటే, వయస్సు పెరుగుతున్నా కాల్షియంలోపం ఏర్పడకుండా ఉంటుంది.
Friday, 13 December 2013
BHAKTHI - TELUGU SAMSKRUTHI - PUJA VIDHANAM
1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి,దానితో రెండు ఒత్తులను(దీపారాధన)వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.
3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం,విష్ణువుకి అలంకారం,వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
5)దీపమును నోటితో ఆర్పరాదు.ఒక దీపం వెలుగుచుండగా,రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.
17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

RUDRAKSHALU - A BRIEF PROFILE
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము.
రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి,
మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల
అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి
కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి,
సుఖసంతోషాలతో
గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన
కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి
రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది.
రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య
వారధిగా భావిస్తారు.
తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు.
అనారోగ్య సమస్యలతో
జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి
సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా
వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి,
అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే
రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన
విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న
వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత
పుణ్యం కలుగుతుంది.
రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో
పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు,
రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా
తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో
వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని
పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల
ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు.
రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన
నియమాలు కొన్ని ఉన్నాయి,
1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి
రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో
రుద్రాక్షమాలను ధరించకూడదు.
రుద్రాక్షమాల ధారణవిధి:
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా
శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ
తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే
ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే
ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల
పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం,
గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.
రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు:
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి
నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం.
రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల
సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది.
జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా
కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.
జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు:
నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని నవముఖి
భరణి షణ్ముఖి
కృత్తిక ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి ద్విముఖి
మృగశిర త్రిముఖి
ఆరుద్ర అష్టముఖి
పునర్వసు పంచముఖి
పుష్యమి సప్తముఖి
ఆశ్లేష చతుర్ముఖి
మఖ నవముఖి
పుబ్బ షణ్ముఖి
ఉత్తర ఏకముఖి, ద్వాదశముఖి
హస్త ద్విముఖి
చిత్త త్రిముఖి
స్వాతి అష్టముఖి
విశాఖ పంచముఖి
అనురాధ సప్తముఖి
జ్యేష్ఠ చతుర్ముఖి
మూల నవముఖి
పూర్వాషాఢ షణ్ముఖి
ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం ద్విముఖి
ధనిష్ట త్రిముఖి
శతభిషం అష్టముఖి
పూర్వాభాద్ర పంచముఖి
ఉత్తరాభాద్ర సప్తముఖి
రేవతి చతుర్ముఖి.

Thursday, 12 December 2013
LORD MAHA SHIV PRAYER IN TELUGU
శ్రీస్వర్ణ || పార్వతీకళ్యాణశివుడు ||
నీ కంటి మెరుపులు ప్రకృతిఫై
కాంతి దుప్పట్లు పరిచాయి
లలాటంఫై మూడో నేత్రం
సూర్యాగ్నిని తలపిస్తూ సిందూర తిలకమై
రెట్టింపు అందాన్ని తెచ్చింది !
జటాజూటంఫై గంగమ్మ
మదిని మైమరిపిస్తుంది
నెలవంక కాంతులన్నీ
నిన్నాశ్రయించాయి వన్నెలద్దుకోడానికి.
గరళం మింగిన గళం
పంచభూతాలకి ఆవాసమైంది
కంఠాన్నలంకరించిన రుద్రాక్షలు
నిర్మలత్వాన్ని సూచిస్తున్నాయి!
కస్తూరి చందనాలు అద్ది
మణిమయ హారాలతో
ముల్లోకాలలోని మగువలు
నీ మనోహర రూపం వీక్షించి
పార్వతిదెంత అదృష్టమో అని తలుస్తారు.
నీ వదనంలోని కాంతిపుంజాలకి
దిగ్దిగంతాలు దేదీప్యంగా శోభిల్లుతున్నాయి
బంగారు రంగారు
పట్టువస్త్రాలంకరణలో మెరిసిపొతున్నావు.
హస్తాలకి పుష్ప కంకణాలు
నీ మేని సుగంధాల ముందు
దాసోహమంటున్నాయి.
అష్టదిక్కులన్ని కలిపి ఆరాధనాగీతాలు
ఆలపిస్తున్నాయి
నీ కంటి మెరుపులు ప్రకృతిఫై
కాంతి దుప్పట్లు పరిచాయి.

Sri Venkateswara Vajra Kavacha Stotram in Telugu
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||

Wednesday, 11 December 2013
Brief Article Kuntala Waterfalls Adilabad, Andhra Pradesh, India - The best Tourism Spot in Andhra Pradesh
భూలోక స్వర్గం 'బోథ్ జలపాతాలు'
ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు ఎంతో మనోహరం గా దర్శనమిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. దట్టమైన అడవుల మధ్య ఎత్తైన కొండలు, లోయలు, గలగల పారే సెలయేళ్లు, జింకవోలే దూకే జలపాతాలు బోథ్ ప్రాంతంలో అధికంగా వుండడం ఆదిలాబాద్ జిల్లాకు అందం... వరం. బోథ్ ప్రాంతంలో మొత్తం 7 జలపాతాలు వుండటంతో ఈ ప్రాంతాన్ని 'సప్త గుండాల బోథ్'గా అభివర్ణిస్తుంటారు. ఈ జల పాతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన జలపాతా లు ఒకటి కుంటాల కాగా, రెండవది పొచ్చర జలపాతం. మిగిలిన జలపాతాలు నాగరికుల కంట పడకుండా ప్రకృతి ఒడిలోనే దాగి పోతు న్నాయి. అయినా జలపాతాలను వీక్షించాలన్న తపనతో పై రెండింటితో పాటు మిగతా జలపాతా లను కూడా పర్యాటకులు సందర్శిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద జలపాతంగా గుర్తించబడిన కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి 12 కి.మీ.దూరంలో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య గల ఈ జలపాతానికి అలనాడు శకుంతల, దుష్యంతుడు విహారయాత్ర కోసం ఇక్కడికి వచ్చారని పూర్వీకులు చెబుతుంటారు. వారి రాక ఆధారంగానే ఈ జలపాతానికి కుంతల జలపాత మని పేరు వచ్చిందని నానుడి. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి వయ్యారంగా జాలు వారే ఈ జలపాతం వీక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. జలపాతానికి సమీపంలో ఒక రాయిపై సోమేశ్వర ఆలయం ఉంది. కేవలం పది మంది మాత్రమే పట్టేవిధంగా ఉండే సోమేశ్వర ఆలయం ఒక గుహ లో ఉంది. అయితే ఈ దేవాలయానికి దక్షిణ దిశలో ఒక పెద్ద సొరంగం కూడా ఉంది. ఈ సొరంగం శ్రీకాళహస్తి వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. సోమేశ్వర ఆలయంలో నంది, పానపట్టం విగ్రహాలు కూడా ఉన్నాయి. ఏకశిల గుహలోకి వెళ్లేటప్పుడు మొదట చీకటిగా ఉండి ఆ తరువాత కొద్దిగా వెలుతురు కనిపిస్తుంది. అక్కడక్కడ అమర్చిన రాళ్లు, తాడు వంటి వాటి సహాయంతో ఆ గుహలోకి వెళ్లి సోమేశ్వరుని దర్శించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రంలోని భక్తులే కాకుండా మహారాష్ట్రకు చెందిన భక్తులు కూడా వచ్చి సోమేశ్వరుడ్ని దర్శించుకుంటారు. ఇదిలావుంటే బోథ్ ప్రాంతం లోని మరో జలపాతం పొచ్చర జలపాతం. ఈ జలపాతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జాతీయ రహదారిలో దిగి వెళ్లే మార్గంలో ఈ జలపాతం ఉంది. పొచ్చర గ్రామ సమీపంలో చిన్న కొండవాగు రాళ్లపై నుంచి దూకే ఈ దృశ్యం ఎంతో మనోహరంగా దర్శనమిస్తుంది. ఏ కాలంలోనైనా ఇక్కడికి చేరుకోవచ్చు. ఒకప్పుడు ఈ జలపాతానికి వెళ్లేందుకు రహదారి కూడా ఉండేది కాదు. ఇప్పుడు రహదారి ఏర్పాటుతో పాటు అక్కడ విద్యుత్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి తోడు జలపాతం చుట్టూ అందమైన మొక్కలతో తీర్చిదిద్ద డమే కాకుండా ఒక వృక్షం నుంచి దేవత ఉద్భవి స్తున్నట్లు అందంగా తీర్చిదిద్దారు. సెలవు వేళల్లో ఇతరత్రా సమయాల్లో పర్యాటకులు, ఆయా పాఠశాలల విద్యార్థులు ఇక్కడికి చేరుకొని ప్రకృతి ఒడిలో సేద తీరుతారు. బోథ్ ప్రాంతంలో జల పాతాలతో పాటు గాయత్రీ, బుంగనాల, సవతుల గుండం వంటి జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
MOSQUITO LOOSER - CHIDRENS MORAL STORY
అదొక దోమ,దానికి ఎంత గర్వమో చెప్పటానికి వీలులేదు. అందరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఒక రోజు అది అడవికి వెళ్ళింది. ఆ అడవిలో ఒక గుర్రం మేతమేస్తూ నిలబడి వుంది. దానికి ఎదురుగా వెళ్ళింది దోమ.
''ఏరు ! ఏం చేస్తున్నా విక్కడ'' అంది దోమ. దోమ మర్యాద లేకుండా మాట్లాడటం చూసి గుర్రం కోపంగా చూసి ఊరుకుంది.
''ఏం- మాట్లాడవేం'' రెచ్చగొడుతూ అడిగింది దోమ.
అయినా గుర్రం'' మాటాడలేదు. నేను తలచుకుంటే నా మిత్రులతో వచ్చి నిన్ను పడెయ్యగలను'' అంది దోమ.
నువ్వు చేసినపుడు చూస్తాలే'' అంది గుర్రం తాపీగా,
గుర్రానికి తనంటే లక్ష్యం లేక పోవడం చూసి దోమకు కోపం వచ్చింది. వెంటనే తన మిత్రులయిన దోమల్ని తీసుకువచ్చింది. ''గుర్రాన్ని కుట్టండి'' అంది. దోమలు గుర్రం మీద ఒక పక్కన వాలాయి. పొగరుబోతు దోమ చూస్తూ అవతల ఉంది. వాటిని తోకతో పారద్రోలాలను కుంది. గుర్రం వీలుపడలేదు. బాధ ఎక్కువైంది.
ఇంక చేసేదిలేక గుర్రం దబ్బున బురదగుంటలో పడింది. దాని వీపు మీదున్న దోమలన్నీ నలిగి చచ్చిపోయాయి.
''చూశావా, నిన్ను పడేశాను'' అంది గర్వంగా.
''నీ బొంద'' నేను పడినందువల్ల నాకు వచ్చిన నష్టం లేదు. కానీ ఏ కారణం లేకుండా నీ మిత్రులు ఇంతమందిని పోగొట్టుకున్నందుకు నువ్వే ఏడవాలి'' అంది గుర్రం, అప్పటికిగాని దోమకి తనెంత నష్టపోయిందీ అర్థం కాలేదు. గర్వంతో మిడిసిపడినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని తెలుసుకుని తన హద్దుల్లో తాను ఉండసాగింది.
ARTILCE ON HUMAN PART - NOSE AND ITS PROBLEMS - BRIEF DISCUSSION
''శరీర మాద్యం ఖలుధర్మ సాధనమ్''
''లోకమందు ఏ కార్యసాధనమునకైనను ముందుగా కావలసింది ఆరోగ్యం'' అన్నాడు మహాకవి కాళిదాసు తన కుమార సంభవంలో.
''ఆరోగ్యమే మహాభాగ్యం''అన్నది నానుడి. మంచి ఆరోగ్యం ఉంటే మనిషికి అన్నీ ఉన్నట్లే అంటారు కూడా! అంటే-మంచి ఆరోగ్యవంతుడైన మనిషి మంచి ఆలోచనలు చేస్తూ, మంచి మార్గంలో ప్రయాణిస్తూ కష్టపడి పనిచేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను తన సొంతం చేసుకుంటాడు.
సామాన్య ఆరోగ్యవంతుడు కూడా తన జీవిత కాలంలో కనీసం మూడుసంవత్సరాల పాటు వ్యాధులతో బాధపడతాడని చెప్పవచ్చు. మనిషికి ప్రాణవాయువును అందిస్తూ మనిషిలోని మిగిలిన అన్ని అవయవాలకు, జవాన్నీ జీవాన్నీ అందించే అత్యద్భుత అవయవాల్లో అతిముఖ్యమైనవి ముక్కు నోరే! ఎందు కంటే-ఒక మనిషి మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా లేక అనారోగ్యాల బారిన పడాలన్నా ముక్కు'నోరే ప్రధాన భూమిక పోషిస్తాయి! అందుకే-మనిషికి వచ్చే జబ్బుల్లో కనీసం, 70%పైగా జబ్బులు ముక్కు' నోరు విషయంలో అలసత్వం, అశ్రద్ధ, అజాగ్రత్తల కారణంగానే వస్తుంటాయని వైద్యశాస్త్రం గుర్తించింది. మనం పీల్చేగాలి, మనం తీసుకునే ఆహారమే మనల్ని ముందుకు నడిపిస్తాయి. వీటి విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా తద్వారా మిగిలిన అవయవాలకు జబ్బులు సోకే ప్రమాదం ఉంటుందని అనుక్షణం గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం.
మనిషికి వచ్చేజబ్బులు సాధారణంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. ఇవి పుట్టుకతో వచ్చే జబ్బులు. వయసుతోబాటు వచ్చే జబ్బులు. అజాగ్రత్తలు లేదా ఇన్ఫెక్షన్స్ ప్రమాదాల కారణంగా వచ్చే జబ్బులు.
ఇక్కడే మనం ఓ ముఖ్య విషయం ప్రస్తావించు కోవాలి. ప్రతిమనిషికీ తనలోనే వ్యాధి నిరోధక శక్తి నిబిడీ కృతమై
ఉంటుంది.
మంచి ఆరోగ్యం ఉన్న మనిషికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఎక్కువ వ్యాధులు వస్తాయని మనం గుర్తించాలి. ముఖ్యంగా-ముక్కు -గొంతు ఇబ్బందులుఉన్నవారిలో వైరస్, బాక్టీరియా క్రిములు త్వరితగతిన చొచ్చుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి! మనిషికి ప్రాణవాయువును అందిస్తూ అతను జీవించడానికి కారణమైన ప్రధాన అవయవమైన ముక్కుకు సంబంధించిన వ్యాధులు పలురకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే-
1. ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం
2. మెదడునుంచి కణితులు ముక్కుద్వారా బయటపడటం
3. ముక్కు చీలిక
4. ముక్కులో ఈగలార్వా అభివృద్ధి చెందటం
5. ముక్కులో వెంట్రుకలు-జిగురులాంటి పదార్థం తయారుకావడం
6.ముక్కునుంచి రక్తం కారడం
7. ముక్కులో కండరాలు పెరగడం
8. ముక్కులో కణితులు పెరగటం
9.సైనొసైటిస్
10. ముక్కు అలర్జీ మరియు వేసోమోటార్ రైనైటిస్.
11. ముక్కులో గడ్డలు
12. ముక్కుపైన గడ్డలు
13. ముక్కు క్యాన్సర్
14. నేనో ఫెరెంజియల్ ఏంజియో ఫైరోమా
15.చిన్న పిల్లల్లో ముక్కు వెనుక భాగాన లింఫ్ గ్రంథులు వాచడం వల్ల వచ్చే అడినాయిడ్స్.
16. ముక్కునుండి దుర్వాసన.
17. ముక్కులో పుండు.
18. ఒక ముక్కునుంచే రసికారడం.
19. ముక్కు నుంచి రక్తం, చీము కారడం.
20. బలపం, బఠానీలు, రబ్బరు, పెన్సిల్, స్పాంజి వంటివి ముక్కులో ఇరుక్కోవడం
21. ముక్కులో పేపరు, పుల్లలు ఉండిపోవడం
22. ముక్కులో రాళ్ళు తయారుకావడం
23. వాసన తెలియక పోవడం, గ్రహణ శక్తి తగ్గిపోవడం
24. ముక్కుతో మాట్లాడటం
25. మూసుకు పోయిన ముక్కు, గాలి పీల్చే నోరు.
26. ముక్కు కారడం (ఇది మెదడులో నీరేనేమో?)
27. కంట్లోనీరు-ముక్కులో జబ్బు
28. సైనస్ తలనొప్పి
29. ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల వచ్చే తలనొప్పి.
ముక్కు గురక
30. గురుక నోటి గురక
శ్వాసనాళం మూసుకుపోవడం వల్ల వచ్చే గురక.
31. ముక్కుకు వచ్చే ఇన్ఫెక్షన్స్
1.సాధారణ జలుబు
2. ముక్కుపైన పుళ్ళు పడటం.
3. దీర్ఘకాలికంగా ఉండే ముక్కువ్యాధులు
4. పొక్కులు కట్టే ముక్కు వ్యాధి (అట్రోఫిక్ రైనైటిస్)
32. ముక్కు ఎముక విరుగుట
33. వంకర ముక్కు.
34. ముక్కులో రక్తం గడ్డ.
(రక్తం గడ్డ చీము గడ్డగా మారడం)
WHY DO WE NEED VITAMINS ?
ఇప్పుడు ఎక్కడ చూచినా 'విటమిన్ల' వాడకం ఎక్కువైపోయింది. అవి బిళ్ళలు, గొట్టాల రూపంలోనూ, త్రాగే మందుల రూపంలోనూ లభిస్తున్నాయి. మనం తినే ఆహార పదార్థాలలో చాలా తక్కువ మోతాదులో విటమిన్లు ఉంటాయి. ఇవి కర్బన పోషకపదార్థాలు శరీరంలో 'జీవక్రియ' జరుగుతుంది కదా! దానిలో ఇవి కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. 'వైటా' అంటే జీవితానికి సంబంధించినది. 'ఎమైన్' అనేది జీవరసాయనిక శాస్త్రపరమైనది. అంటే ప్రాణానికి హేతువైన ఒక ఎమైన్ అని అర్థం. విటమిన్ల లోపం వలన అనేక వ్యాధులు కలుగుతాయి.
ఇప్పటి వరకు 20 రకాల విటమిన్లు గుర్తించారు. ముఖ్యమైనవి 6 మాత్రమే! అని 'ఎమిసిడిఇకె' ఇందులో ఎడిఇకెలు క్రొవ్వులో కరుగుతాయి. బి.సి.లు నీటిలో కరుగుతాయి. విటమిన్ ఎ: ఇది లేకపోతే దృష్టి తగ్గుతుంది. అంటు వ్యాధులు, చర్మరోగాల నుండి రక్షిస్తుంది. విటమిన్ బి: దీనిలో చాలా రకాలున్నాయి.. అన్నిటినీ కలిపి 'బి కాంప్లెక్స్ '' అంటారు. 'బి' లోపం బెరి బెరిని కలిగిస్తుంది.' బి2' 'చర్మరోగాలు, నాలుకపై పుండ్లు, పెదవులు పగులుతాయి. 'బి6' మెదడులో వత్తిడి' మెదడులో వత్తిడి పెరుగుతుంది. ఆకలి నశిస్తుంది. 'బి7' అజీర్ణవ్యాదులు వస్తాయి. 'బి12' శక్తి హీనత కలుగుతుంది. ఇది ఉంటే 'కేంద్రనాడీ మండలం' సరిగా పనిచేస్తుంది. విటమిన్ సి: స్కర్వీ అనే రోగం వస్తుంది. నోరు పుండు పడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. చర్మం క్రింద కేశనాళికలు చిట్లుతాయి. విటమిన్ డి: చిన్నపిల్లల్లో రెకెట్స్' కలిగిస్తుంది. పెద్దల్లో ఎముకలు పెళుసుబారేలా చేస్తుంది. విటమిన్ ఇ: రక్తం. మెదడు, కాలేయాలకు ప్రమాదం. విటమిన్ కె: రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. వీటిల్లో ' ఏ' విటమిన్ లోపం ఉన్నా వాటిని సరిదిద్దుకోవటం అవసరం.
WHERE IS THE BOSS ? AKBAR BIRBAL STORIES COLLECTION
అక్బర్ చక్రవర్తి కొలువుకు రకరకాల వ్యక్తులు వస్తుండేవారు. వారంతా రకరకాల సమస్యలతో వస్తుం టారు. అందులో కొన్ని జటిలంగా ఉంటే, కొన్ని సరదాకా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా బీర్బల్ సమయస్పూర్తితో చాలా తేలికగా పరిష్కరిం చేవాడు. ఒకసారి పొరుగుదేశం నుండి ఇద్దరు వ్యక్తులు అక్బర్ కొలువుకు వచ్చారు. వారిద్దరూ ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నారు.'' అక్బర్ పాదుషా వారికి వందనాలు. ప్రభూ! నా పేరు చిత్రసేనుడు. ఇతడు సుగ్రీవుడు మా పనివాడు'' అని చెప్పాడు ఒక వ్యక్తి.వెంటనే రెండోవ్యక్తి 'అబద్ధం నేను ఇతని పనివాణ్ని కాదు. ఇతనే నా పనివాడు' అన్నాడు. ''ఇంతకూ ఎవరు పనివారు? ఎవరు యజమాని? ''అయోమయంగా అడిగాడు అక్బర్. నేను యజమాని నంటే నేను యజమానినని -నువ్వు పనివాడివంటే నువ్వు పని వాడివని వారిద్దరూ వాదించుకోసాగారు. అక్బర్‌కు, అక్కడి సభలోని వారికి ఎవరు నిజం చెప్తున్నారో అర్ధం కాలేదు. చివరకు అక్బర్ బీర్బల్ సహాయాన్ని అర్థించాడు.''బీర్బల్! వీళ్ళద్దిరిలో పనివా డెవరో చెప్పగలవా? అని అడిగాడు అక్బర్. అంతవరకు జరుగుతున్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్, ''తప్పకుండా ప్రభూ !నేను తేలికగా పనివాడిని గుర్తించగలను'' అన్నాడు. బీర్బల్ ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి కాసేపు వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు నటించి, ''మీరిద్దరు నేలమీద బోర్లా పడు కోండి ''అన్నాడు. బీర్బల్ సూచిం చిన ట్టు చిత్రసేనుడు. సుగ్రీవుడు నేలమీద పడుకు న్నారు.. అక్బర్‌తో సహా సభికు లందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొద్దిక్ష ణాలు గడిచాయి. బోర్లా పడుకున్న వ్యక్తు లకు ఏం జరుగుతుందో తెలియ ట్లేదు. ఇంతలో బీర్బల్ గట్టిగా ''భటులారా! వీడే పనివాడు . వెంటనే అతని తలను నరకండి'' అనడం వినిపించింది. అది విని చిత్రసేనుడనే వ్యక్తి పైకి లేచాడు'' ప్రభూ! నేను పని వాడిని . నన్ను చంపకండి.'' అంటూ కంగారుగా చుట్టూ చూశాడు. అక్కడ భటులు కనిపించలేదు. నవ్వు తూ నిలబడ్డ బీర్బల్ కనిపించాడు. ''వాV్‌ా బీర్బల్! నీ తెలివి అమోఘం. శభాష్!'' అంటూ అక్బర్ అభినందనగా చప్పట్లు చరిచాడు. మరుక్షణం అక్బర్ కొలువంతా చప్పట్లతో మారుమ్రోగింది.
most common symptoms that women suffer during pregnancy is back pain - tips to reduce back pain during pregnancy
గర్భధారణ సమయంలో వెన్నునొప్పి
50శాతం మంది మహిళలలో గర్భధారణ సమయంలో వెన్ను దిగువ భాగాన నొప్పి వస్తుంది. గర్భధారణ సమయంలో వెన్ను నొప్పి తీవ్రంగా ఉండి, బాధను, అశక్తతను కలిగిస్తుంది. గర్భధారణ తరువాత వచ్చే వెన్నునొప్పిని తట్టుకునేలా చేస్తుంది. గర్భధారణ వలన కలిగే వెన్నునొప్పి మరింత పెరిగే అవకాశం ఉండదు. ఈ నొప్పి, బరువు పెరగడం, వ్యాయామం, పనిలో సంతృప్తి లేదా గర్భంలోని బిడ్డ బరువు, పొడవు బిడ్డ భౌతిక లక్షణాల వంటి వాటివలన కలుగుతుంది. గర్భధారణ యొక్క జీవయాంత్రిక కారకాలతో పాటుగా, పొత్తికడుపు సగిట్టల్, తిర్యక్ వ్యాసం, లూంబార్ లార్డోసిస్ లోతువంటివి దిగువ భాగపు వెన్ను నొప్పికి కారణమవుతాయి. నిలబడడం, కూర్చోవడం, ముందుకు వంగడం, బరువులు ఎత్తడం, నడవడం వంటి వాటితోపాటుగా, సంక్లిష్టమైన కారకాలు నొప్పి తీవ్రతను పెంచుతాయి.
గర్భధారణ సమయంలోకనబడే వెన్నునొప్పి తోడలలోకి, పిరుదులలోకి వ్యాపించవచ్చు, రాత్రి సమయాలలో ఈనొప్పివల్ల నిద్రపోవడానికి వీలుపడకపోవచ్చు. కొన్ని సార్లు పగటిపూట ఎక్కువగాను, కొన్నిసార్లు రాత్రిపూట ఎక్కువగాను ఉండవచ్చు. ఈ నొప్పి తీవ్రం కాకుండా ఉండడానికి, శరీరాన్ని అధికంగా వంచి బరువులను ఎత్తడం, ఒంటికాలిమీద నిలబడడం, మెట్లెక్కడం వంటివి చేయరాదు మోకాళ్ళను వంచకుండా ఉండాలి. సరాసరి కిందికి వంగటం గర్భిణీలలోనూ, మామూలు వ్యక్తులలోనూ వెన్ను దిగువ భాగపు నొప్పికి కారణం అవుతుంది. ఇబ్బందికార పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే వైద్యసహాయం పొందాడం చాలా సమయాల్లో మేలు చేస్తుంది.
Subscribe to:
Posts (Atom)